ఇరాన్ ని నామరూపాలు లేకుండా చేస్తాం.. అమెరికాకి నరకం ఏంటో చూపిస్తాం.. వరల్డ్ వార్ రేంజ్‌లో ట్రంప్ వర్సెస్ ఇరాన్..

ఇరాన్ ని నామరూపాలు లేకుండా చేస్తాం.. అమెరికాకి నరకం ఏంటో చూపిస్తాం.. వరల్డ్ వార్ రేంజ్‌లో ట్రంప్ వర్సెస్ ఇరాన్..

ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు అంటుకున్నాయి. దింతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం శృతిమించింది. ఒకరినొకరు పూర్తిగా నాశనం చేసుకునేలా రెండు దేశాల అగ్రనేతలు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇరాన్‌పై అమెరికా జరిపిన  విమాన దాడుల అనంతరం.. "మళ్లీ యుద్ధం వస్తే ఇరాన్ అనే దేశం భూమ్మీద మిగలదు" అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా... దీనికి కౌంటర్‌గా, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడి చేసి 'నరకం' చూపిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించడంతో అంతర్జాతీయంగా పెను కలకలం రేగుతోంది.

మళ్లీ యుద్ధం వస్తే.. ఇరాన్ ఉండదు: ట్రంప్
యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన పరిస్థితే వస్తే ఇరాన్ అనే దేశం ఇక ఉనికిలో ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. "కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించినందుకు అమెరికా విమానాలు ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ ప్రాంతాలను, తీరప్రాంత రాడార్ సైట్ లను ధ్వంసం చేశాయి. ఇకవారు ఎప్పటికీ మారకపోవచ్చు. అప్పుడు మేం ప్రారంభించిన పనిని సైనిక పరంగా ముగించాల్సి వస్తుంది. అదేజరిగితే, ఇరాన్ ఇక ఉనికిలో ఉండదు" అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాకు నరకం చూపిస్తాం: ఇరాన్
ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. రాబోయే రోజుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు నరకాన్ని చవిచూస్తాయని హెచ్చరించింది. "హార్మూజ్ జలసంధి తీరంలోని సిరిక్ వద్ద అమెరికా జరిపిన దాడులు హార్మూజ్ జలసంధిపై మాకున్న నియంత్రణను చేధించలేవు. కానీ నిబంధనలను ఉల్లంఘించే వారిపై మేం జరిపే దాడులు ఇతర నౌకలకు ప్రయాణ నిబంధనలను గుర్తుచేస్తాయి" అని ఐఆర్జీసీ నౌకాదళ కమాండర్ అన్నారు. "ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాల లెక్కింపు వేరేలా ఉంటుంది. రాబోయే రోజుల్లో అవి నరకాన్ని అనుభవిస్తాయి" అని హెచ్చరించారు. అమెరికా దాడులను ఇలాగే కొనసాగిస్తే, యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.