చిన్నారుల ఆరోగ్యం, విద్యా బలోపేతం చే సేందుకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అలాంటి స్కీంలలో అంగన్ వాడీ కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ , భోజనం పథకం ఒకటి. ఈ పథకం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం ఈ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అంగన్ వాడీలో నిర్లక్ష్యం, సిబ్బంది నిర్వాకంతో చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు.. నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనం విషయంలో,పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. యూపీలోని ఓగ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో కర్రీ లేకుండా ఉప్పుతో చపాతి తింటున్న విద్యార్థి వీడియో వైరల్ కావడంతో అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ మరోసారి చర్చనీయాంశమైంది.
మధ్యప్రదేశ్ లోని మైహర్ జి్లాలోని కాక్రా అనే గ్రామం అంగన్ వాడీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించినవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన మూడు నెలల తర్వాత అధికారులు చర్యలకు ఆదేశించడంతో పెద్ద చర్చకు దారి తీసింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి విద్యార్థి కర్రీ లేకుండా చపాతిని ఉప్పుతో తింటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈవీడియో అంగన్ వాడీ కేంద్రాల్లో అందించే ఫుడ్ క్వాలిటీపై తీవ్ర ఆందోళన రేకెత్తించింది. సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు ప్రభుత్వాన్ని ఖండించారు.
ఇక ఈ వీడియో మహిళా శిశుసంక్షేమ శాఖ కు చేరడంతో సుమోటోగా స్వీకరించి ఘటనపై విచారణకు ఆదేశించింది. వీడియోను పరిశీలించి ప్రాజెక్టు అధికారిపై చర్యలుతీసుకుంటామని హామి ఇచ్చింది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఈ ఘటనతో అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ఉద్దేశించిన పోషకాహార పథకాల అమలుపై మరోసారి అనేక సందేహాలను లేవనెత్తింది.
