అమెరికాలో దారుణం.. చాట్‌జీపీటీలో వెతికి మరీ తల్లి, తమ్ముడిని చంపిన 17 ఏళ్ల భారత సంతతి యువకుడు !

అమెరికాలో దారుణం.. చాట్‌జీపీటీలో వెతికి మరీ తల్లి, తమ్ముడిని చంపిన 17 ఏళ్ల భారత సంతతి యువకుడు !

అమెరికాలో దారుణం జరిగింది. మసాచుసెట్స్‌లో సొంత తల్లిని, 14 ఏళ్ల తమ్ముడిని.. ఓ 17 ఏళ్ల భారత సంతతి యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ యువకుడి పై హత్య కేసు నమోదు చేశారు. 

సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే.. ఆక్టన్ ప్రాంతంలో నివసించే అర్జున్ అరవింద్ (17) అనే యువకుడు.. తన తల్లి సుధా వెంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ (14)ను హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడే ముందు, తన కుటుంబాన్ని ఎలా చంపాలనే దానిపై ఇంటర్నెట్‌లోనూ, ChatGPTలోనూ తెగ వెతికాడని దర్యాప్తులో అధికారులు గుర్తించారు.

పోలీసులకు ఎలా తెలిసిందంటే :
ఆగస్టు 11వ తేదీ సాయంత్రం, తన ఇంటివారితో మాట్లాడలేకపోతున్నానని అర్జున్ తండ్రి ఆక్టన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ట్యూటర్ కూడా ఎంత పిలిచినా ఎవరూ తలుపు తీయలేదు.

దీంతో పోలీసులు వెంటనే ఆ ఇంటికి వెళ్లి చూడగా.. తమ్ముడు సిద్ధార్థ్ మొదటి అంతస్తులో, తల్లి సుధా కింద ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. వీరి శరీరాలపై తీవ్రమైన గాయాల గుర్తులు కూడా ఉన్నాయి.

పోలీసుల అదుపులో నిందితుడు:
పోలీసులు వచ్చేసరికి అర్జున్ ఇంటి నుండి తన తల్లి కారును తీసుకుని పారిపోయాడు. వెంటనే అతడి కోసం పోలీసులు గాలించగా.. బుధవారం తెల్లవారుజామున వేలాండ్‌లోని ఒక పార్కింగ్ స్థలంలో కారుతో పాటు ఉన్న అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు  అసలు కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.