నెట్‌వర్క్ లేకపోయినా పనిచేసే 'ఐటెల్ జెనో 100'.. కిందపడినా పగలని స్ట్రాంగ్ ఫోన్!

నెట్‌వర్క్ లేకపోయినా పనిచేసే 'ఐటెల్ జెనో 100'.. కిందపడినా పగలని స్ట్రాంగ్ ఫోన్!

టెక్ బ్రాండ్ ఐటెల్  కొత్త  బడ్జెట్ ఫోన్ ఐటెల్ జెనో 100ను ఈరోజు(మార్చ్ 11)న ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్  అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ దాని మన్నిక ఇంకా ప్రీమియం లుక్. ఈ మిలిటరీ-గ్రేడ్ ఫోన్ 1.2 మీటర్ల ఎత్తు నుండి కిందపడ్డ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నెట్‌వర్క్ లేకుండా కూడా కాల్స్ చేయవచ్చు. 

కంపెనీ ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ అందించింది. Itel Zeno 100 భారతదేశంలో 2 వేరియంట్లలో వస్తుంది. ఒకటి 3GB RAM - 64GB స్టోరేజ్ తో బేస్ వేరియంట్ ధర రూ.6866.  రెండవ వేరియంట్ 4GB RAM - 64GB స్టోరేజ్ ధర రూ.7285.  

Also Read : గ్యాస్ కొరతతో భారీగా పెరిగిన స్టాక్స్ ఇవే
 
ఈ  ఫోన్ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ బాడీపై నిర్మించింది. అంటే చాలా మన్నికైనది ఇంకా కఠినమైన పరిస్థితులను తట్టుకోగలదు.  ఫోన్ వెనుక భాగం OnePlus 15 లాంటి  ప్రీమియం ఫీల్ ఇస్తుంది. దీనికి పెద్ద గుండ్రటి  బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ ఉంది. ఈ ఫోన్ మైనస్ 35 డిగ్రీల తీవ్రమైన చలి, 43 డిగ్రీల తీవ్రమైన వేడిలో కూడా పనిచేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్  టైటానియం గోల్డ్, ప్యూర్ బ్లాక్, సిల్క్ గ్రీన్ అనే మూడు కలర్ అప్షన్స్ లో లభిస్తుంది. ఫోన్  కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లు ఉంటాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌లోనే ఇంటిగ్రేట్ చేసింది. పైన మీ టీవీని కంట్రోల్ చేయడానికి  IR బ్లాస్టర్‌ కూడా ఉంది.

ఐటెల్ జెనో 100 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌తో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ అయిన  90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అంటే  స్క్రోలింగ్,   వీడియో వ్యూ సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది. సెల్ఫీల  కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో  8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు ఇంకా వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

ఈ ఫోన్ Unisoc T7100 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో 'Android 15 Go' పై నడుస్తుంది. ఈ OS తక్కువ స్టోరేజ్, తేలికపాటి ప్రాసెసర్‌లు ఉన్న ఫోన్‌ల కోసం రూపొందించారు, అందుకే ఫోన్ హ్యాంగ్ అవ్వదు. 

ఈ ఫోన్‌కు  పెద్ద 5000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు.  దీని బ్యాటరీ  ఈజీగా రెండు రోజుల వరకు ఉంటుంది. ఈ ఫోన్  అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ అల్ట్రా లింక్ టెక్నాలజీ. దీని సహాయంతో నెట్‌వర్క్ లేనప్పుడు కూడా కాల్స్ చేయవచ్చని కంపెనీ చెబుతుంది. ఈ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. 4G సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్  ఫీచర్లు కూడా ఉన్నాయి.