సోషల్ మీడియాలో సాయిబాబాపై తప్పుడు ప్రచారం.. సినీనటి మాధవీలతపై ఎఫ్ఐఆర్

సోషల్ మీడియాలో సాయిబాబాపై తప్పుడు ప్రచారం.. సినీనటి మాధవీలతపై ఎఫ్ఐఆర్

హైదరాబాద్: సినీనటి మాధవీలతపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎ ఆర్ నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్ర చారాలు, వ్యాప్తి చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ప్రజల భావోద్వేగాలను నష్టపరిచాయని ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. డిసెంబర్ 30న ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సరూర్ నగర్ పోలీసులు ఆదేశించారు. మాధవీలతతో పాటు మిగతా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. 

సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయడం లేదా ఇతరుల నమ్మకాలను కించపరచడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.