పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ... హ్యాట్రిక్ విజయంతో సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌కు..

పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ... హ్యాట్రిక్ విజయంతో సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌కు..
  • దంచికొట్టిన ఇషాన్ .. అదరగొట్టిన బౌలర్లు
  • దాయాది జట్టుపై ఇండియా గ్రాండ్ విక్టరీ
  • 61 రన్స్ తేడాతో చిత్తయిన సల్మాన్ సేన
  • 40 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 77 రన్స్​తో చెలరేగిన ఇషాన్
  • పాక్ బ్యాటర్స్​ను ఆటాడుకున్న బౌలర్లు​
  • 61 రన్స్​ తేడాతో చిత్తైన పాకిస్తాన్​
  • టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–8కు టీమిండియా

గ్రౌండ్ ఏదైనా.. గండం మాత్రం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అని ఇండియా మరోసారి చాటి చెప్పింది. మహాశివరాత్రి పర్వదినాన జరిగిన టీ20 వరల్డ్ కప్ మెగా సమరంలో టీమిండియా రుద్రరూపం ముందు దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది. శ్రీలంక గడ్డపై యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్ (40 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) షాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శివాలెత్తిన వేళ.. ఆదివారం జరిగిన హై-ఓల్టేజ్ పోరులో 61 రన్స్ తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన సూపర్-8 కు దూసుకెళ్లింది. 

స్పిన్ వలతో మనల్ని బోల్తా కొట్టించాలనుకున్న పాక్ ఎత్తులను కిషన్ తన బ్యాట్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తుత్తునియలు చేస్తూ  మైదానంలో ‘రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’రగం సృష్టించాడు. దాంతో 20 ఓవర్లలో ఇండియా 175/7 స్కోరు చేసింది. అనంతరం  వికెట్ల వేటలో పోటీపడ్డ బౌలర్లు  పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓ ఆటాడుకున్నారు. మన బౌలర్ల మూకుమ్మడి దాడికి పాక్ 18 ఓవర్లలో 114 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా  వరల్డ్ కప్ చరిత్రలో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజయాల రికార్డును 8-1కి పెంచుకున్న ఇండియా సరికొత్త చరిత్ర లిఖించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు.. పాక్ అహంకారంపై ఎగురవేసిన విజయకేతనం! జయహో ఇండియా!

పాకిస్తాన్‌‌‌‌తో ఏ గ్రౌండ్‌‌‌‌లో వార్‌‌‌‌‌‌‌‌కు దిగినా తమకు తిరుగులేదని ఇండియా మళ్లీ చాటిచెప్పింది. టీ20 వరల్డ్ కప్‌‌‌‌ హై ఓల్టేజ్ పోరులో టీమిండియా కొట్టిన దెబ్బకు పాక్ బేజారింది. 18 ఓవర్లు స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేసి తమను దెబ్బతీయాలని చూసిన దాయాదిపై యంగ్‌‌‌‌ ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఫోర్లు, సిక్సర్లతో తాండవం చేసిన వేళ.. బౌలర్లు బంతితో పాక్‌‌‌‌ను అష్టదిగ్బంధనం చేశారు. 

ఫలితంగా మెగా టోర్నీలో పాక్‌‌‌‌పై అతి పెద్ద విజయం అందుకున్న టీమిండియా  సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌కు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్స్‌‌లో  ఆ జట్టుపై విజయాల రికార్డును 8–1కి పెంచుకుంది. ఓటమి భయంతోనే కాబోలు.. ముందే బాయ్‌‌‌‌కాట్ రాగం ఎత్తుకున్న పాక్‌‌‌‌కు అసలైన సినిమా చూపించింది! మొత్తంగా మహా శివరాత్రి రోజున యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లప్పగించి చూసిన మెగా మ్యాచ్‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌కు కాళరాత్రిగా మారింది.

కొలంబో: ఈసారైనా హోరాహోరీగా సాగుతుందని అనుకున్న ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ హై ఓల్టేజ్‌‌‌‌ పోరు మళ్లీ వన్‌‌‌‌సైడే అయ్యింది. గ్రౌండ్‌‌‌‌లో పాక్‌‌‌‌కు షేక్‌‌‌‌హ్యాండ్ ఇవ్వని సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా.. తమ ఆటతో  ప్రత్యర్థిని మరోసారి షేక్ చేసింది.  టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో భాగంగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 61రన్స్ తేడాతో పాక్‌‌‌‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.  టోర్నీలో హ్యాట్రిక్ విక్టరీతో సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌కు దూసుకెళ్లింది. 

వన్‌‌‌‌సైడ్‌‌‌‌  పోరులో తొలుత ఇండియా 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లతో 29), శివం దూబే (17 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 27), తిలక్ వర్మ (25) కూడా రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ ఆయుబ్ (3/25) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌‌‌లో పాక్ 18 ఓవర్లలో 114  రన్స్ కే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (34 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 44), షాహీద్‌‌‌‌ ఆఫ్రిది (23 నాటౌట్‌‌‌‌) మాత్రమే కాస్త పోరాడారు. ఇండియా బౌలర్లలో హార్దిక్‌‌‌‌, బుమ్రా, అక్షర్, వరుణ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌‌‌‌లో నెదర్లాండ్స్‌‌‌‌తో ఇండియా పోటీ పడనుంది.

18 ఓవర్లు స్పిన్..  ఇషాన్‌‌‌‌ ధనాధన్‌‌

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్‌‌‌‌ స్లో, టర్నింగ్ వికెట్‌‌‌‌పై స్పిన్‌‌‌‌తో ఇండియాను దెబ్బకొట్టాలని ప్లాన్ చేసింది. ఏకంగా 18 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేసింది.  కెప్టెన్, పార్ట్‌‌‌‌టైమ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ సల్మాన్ ఆఘా ఫస్ట్ ఓవర్లో తానే బౌలింగ్‌‌‌‌కు దిగాడు. తొలుత ఈ ప్రయోగం ఫలించింది. ఇన్నింగ్స్ ఆరో బాల్‌‌‌‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ (0) భారీ షాట్‌‌‌‌కు ప్రయత్నించి షాహీన్ చేతికి చిక్కడంతో ఆదిలోనే ఇండియాకు షాక్ తగిలింది. కానీ మరో డ్యాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌‌‌‌.. పాక్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను దెబ్బ తీశాడు.  పిచ్ నెమ్మదిగా ఉన్నా.. స్టార్టింగ్‌‌‌‌లోనే  వికెట్ పడినా అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఆడాడు. 

స్టేడియం నలుమూలలా షాట్లు కొడుతూ ఇండియా హీరో అయ్యాడు.  రెండో ఓవర్లో పేసర్  షాహీన్ వేసిన ఫస్ట్ బాల్‌‌‌‌నే  ఇషాన్  పుల్ షాట్‌‌‌‌తో మిడ్-వికెట్ మీదుగా  సిక్స్ కొట్టిన తీరు ఇన్నింగ్స్‌‌‌‌కే హైలైట్‌‌‌‌.  పవర్ ప్లేలోనే పాక్‌‌‌‌  ముగ్గురు స్పిన్నర్లను బౌలింగ్‌‌‌‌కు దింపినా.. ఇషాన్‌‌‌‌  వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఐదో ఓవర్లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌‌‌‌లో సిక్స్, ఫోర్ బాదాడు. థర్డ్ మ్యాన్ దిశగా అతను ఆడిన లేట్ కట్ షాట్ అద్భుతం. 

మరో ఎండ్‌‌‌‌లో తిలక్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌తో ఇషాన్‌‌‌‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. సైమ్‌‌‌‌ వేసిన ఆరో ఓవర్లో ఇషాన్, తిలక్ చెరో ఫోర్ రాబట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను ఇండియా 52/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ఇషాన్‌‌‌‌ మరింత రెచ్చిపోయాడు. అబ్రార్ వేసిన ఏడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించి 27 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే షాదాబ్‌‌‌‌కు6, 4తో వెల్‌‌‌‌కం చెప్పిన అతను సెంచరీ చేసేలా కనిపించాడు.  

దెబ్బకొట్టిన సైమ్‌‌‌‌ ఆయుబ్‌‌‌‌

ఇషాన్ దూకుడు చూస్తుంటే ఇండియా ఈజీగా 200 రన్స్ చేసేలా కనిపించింది. కానీ, పాక్ పార్ట్‌‌‌‌టైమ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ సైమ్‌‌‌‌ అయూబ్  టీమిండియా జోరుకు బ్రేక్ వేశాడు.  దూకుడుగా ఆడుతున్న కిషన్‌‌‌‌ను తొమ్మిదో ఓవర్లో స్లో బాల్‌‌‌‌తో బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌‌‌‌కు  87 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. ఈ టైమ్‌‌‌‌లో తిలక్‌‌‌‌కు తోడైన కెప్టెన్ సూర్య కుదురుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. సూర్య బ్యాటింగ్‌‌‌‌కు రాగానే సల్మాన్‌‌‌‌ పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌‌‌‌ను బౌలింగ్‌‌‌‌ను దింపాడు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లను ప్రయోగించడంతో  తిలక్‌‌‌‌, సూర్య భారీ షాట్లు ఆడలేకపోయారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత సైమ్‌‌‌‌ ఇండియాకు డబుల్‌‌‌‌ షాకిచ్చాడు. 15వ ఓవర్లో వరుస బాల్స్‌‌‌‌లో తిలక్‌‌‌‌,  హార్దిక్ పాండ్యా (0)ను ఔట్‌‌‌‌ చేసి దెబ్బకొట్టాడు.  

దూబే, రింకూ ఫినిషింగ్ టచ్‌‌‌‌

పాక్ స్పిన్నర్లు కట్టడి చేయడంతో 13 నుంచి 17 ఓవర్ల మధ్యలో ఇండియా 22 రన్స్ మాత్రమే చేసి డీలా పడింది. అయితే. స్లాగ్ ఓవర్లలో సూర్య, శివం దూబే జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. అబ్రార్ వేసిన 18వ ఓవర్లో సూర్య ఫోర్‌‌‌‌‌‌‌‌, దూబే సిక్స్‌‌‌‌తో మళ్లీ జోష్ తెచ్చారు. కానీ, 19వ ఓవర్లో సూర్యను ఔట్ చేసిన తారిఖ్‌‌‌‌ 5 రన్సే ఇచ్చాడు. షాహీన్ వేసిన ఇన్నింగ్స్ లాస్ట్‌‌‌‌ ఓవర్లో  దూబే ఓ ఫోర్ కొట్టగా.. హిట్టర్ రింకూ సింగ్ (11 నాటౌట్‌‌‌‌) వరుసగా 4, 6తో స్కోరు 170 దాటించాడు. ఐదో బాల్‌‌‌‌కు దూబే రనౌటవ్వగా.. లాస్ట్ బాల్‌‌‌‌కు భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసిన అక్షర్​ (0) సైమ్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు.    

వణికిన పాక్..

టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌లో  ఇండియా బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కోలేక పాక్‌‌ తోకముడిచింది. ఆ దేశ స్పిన్నర్లు రాణించిన వికెట్‌‌‌‌పై సూర్యసేన పేస్‌‌‌‌, స్పిన్‌‌‌‌తో అదరగొట్టింది.  హార్దిక్, బుమ్రా తమ తొలి ఓవర్లలోనే ప్రత్యర్థిని చావు దెబ్బకొట్టారు. ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షాహిబ్జాదా ఫర్హాన్‌‌‌‌ (0)ను నాలుగో బాల్‌‌‌‌కే స్లో  షార్ట్ పిచ్‌‌‌‌ డెలివరీతో పాండ్యా బోల్తా కొట్టించాడు. రెండో ఓవర్లో తనకు సిక్స్‌‌‌‌తో వెల్‌‌‌‌కం చెప్పిన సైమ్ ఆయుబ్ (6)ను బుమ్రా ఫుల్ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌తో ఎల్బీ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.  

లాస్ట్ బాల్‌‌‌‌కు కెప్టెన్ సల్మాన్ (4)ను పెవిలియన్ చేర్చడంతో పాక్ 13/3తో ఎదురీత మొదలు పెట్టింది.  ఐదో ఓవర్లో బాబర్ ఆజమ్ (5)ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో  పాక్ జట్టంతా సైలెంట్ అయిపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఓ ఎండ్‌‌‌‌లో ఉస్మాన్ ఖాన్ భారీ షాట్లతో ఎదురుదాడికి దిగాడు. అక్షర్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసి అతని బౌలింగ్‌‌‌‌లోనే ఆరు ఫోర్లు కొట్టాడు. అయితే పదో ఓవర్లో ఉస్మాన్‌‌‌‌ను స్టంపౌట్‌‌‌‌ చేసిన అక్షర్ రివెంజ్ తీర్చుకున్నాడు. ఆ వెంటనే కుల్దీప్ బౌలింగ్‌‌‌‌లో నవాజ్ (4) వెనుదిరగ్గా.. తిలక్ బౌలింగ్‌‌‌‌లో షాట్‌‌‌‌కు ట్రై చేసిన షాదాబ్ ఖాన్ (14) దూబే క్యాచ్ ఇవ్వడంతో పాక్ ఓటమి ఖాయమైంది. చివర్లో షాహీన్ ఆఫ్రిది మెరుపులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.  

నో షేక్‌‌హ్యాండ్‌‌

ఆసియా కప్‌‌లో మొదలైన నో షేక్‌‌హ్యాండ్ పాలసీని ఇండియా ఈ మ్యాచ్‌‌లోనూ కొనసాగింది. టాస్ టైమ్‌‌లో పాక్ కెప్టెన్‌‌ సల్మాన్ కు సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆట పూర్తయ్యాక ఇరు జట్ల ప్లేయర్లు చేతులు కలపలేదు. 

పాక్‌‌‌‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన  ఇండియన్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌). 2012లో యువరాజ్‌‌‌‌ సింగ్ 29 బాల్స్‌‌‌‌ లో కొట్టిన ఫిఫ్టీ రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు.
టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ పవర్‌‌‌‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడం ఇది రెండోసారి.టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో డకౌటైన మూడో బ్యాటర్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ శర్మ. ఆశిష్‌‌‌‌ నెహ్రా, ఇమ్రుల్‌‌‌‌ కయేస్‌‌‌‌ (బంగ్లాదేశ్‌‌‌‌) ముందున్నారు. టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో పాక్‌‌‌‌పై ఇండియా ఆధిక్యం ఇది. ఈ టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువ సార్లు గెలిచిన రికార్డు కూడా ఇదే. బంగ్లాదేశ్‌‌‌‌పై ఆసీస్‌‌‌‌ ఆరుసార్లు గెలిచింది.ఈ మ్యాచ్‌‌లో పాక్ 18 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. ఓ వరల్డ్ కప్‌‌ ఇన్నింగ్స్‌ లో స్పిన్నర్లు అత్యధిక ఓవర్లు వేసిన రెండో మ్యాచ్‌ ఇది. 2012లో ఆస్ట్రేలియాపై పాక్‌‌ 18 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసింది.

స్కోర్‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌

ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌: అభిషేక్  (సి) షాహీన్ (బి) సల్మాన్ 0, ఇషాన్ (బి) సైమ్ 77, తిలక్ (ఎల్బీ) (బి) సైమ్ 25, సూర్యకుమార్ (సి) సైమ్ (బి) ఉస్మాన్ 32, హార్దిక్ (సి) బాబర్ (బి) సైమ్ 0, దూబే (రనౌట్) 27, రింకూ సింగ్ (నాటౌట్) 11, అక్షర్ (సి) సైమ్ (బి) షాహీన్ 0; ఎక్స్‌‌‌‌ట్రాలు: 3; మొత్తం 20 ఓవర్లలో 175/7; వికెట్ల పతనం:1–1, 2–88, 3–126, 4–126, 5–159, 6–175, 7–175; బౌలింగ్‌‌‌‌:  సల్మాన్ 2-–0-–10-–1, షాహీన్ 2–-0-–31–-1, సైమ్ అయూబ్ 4-–0–-25–-3, అబ్రార్ 3–-0-–38–-0, షాదాబ్ 1–-0-–17-–0,  నవాజ్ 4-–0-–28-–0, ఉస్మాన్ తారిఖ్ 4–-0–-24-–1.

పాకిస్తాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌:  సాహిబ్జాదా (సి) రింకూ (బి) పాండ్యా 0, సైమ్ (ఎల్బీ) (బి) బుమ్రా 6, సల్మాన్  (సి) పాండ్యా (బి) బుమ్రా 4, బాబర్ (బి) అక్షర్ 5, ఉస్మాన్ (స్టంప్డ్) కిషన్ (బి) అక్షర్ 44, షాదాబ్ (సి) దూబే (బి) తిలక్ వర్మ 14, నవాజ్ (సి) దూబే (బి) కుల్దీప్ 4, ఫహీమ్ అష్రఫ్ (సి) రింకూ  (బి) వరుణ్ 10, షాహీన్ అఫ్రిది (నాటౌట్) 23, అబ్రార్ (ఎల్బీ) వరుణ్ 0, తారిఖ్ (బి) పాండ్యా 0;  ఎక్స్‌‌‌‌ట్రాలు: 4;  మొత్తం: 18 ఓవర్లలో  114 ఆలౌట్‌‌‌‌; వికెట్ల పతనం: 1–-0, 2–-6, 3–-13, 4–-34, 5–-73, 6–-78, 7–-78, 8-–97, 9–-97, 10–-114; బౌలింగ్: హార్దిక్ 3-–1-–16–-2, బుమ్రా 2–-0–-17–-2, అక్షర్ 4–-0–-29–-2, వరుణ్ చక్రవర్తి 3–-0-–17-–2, కుల్దీప్  3–-0–-14-–1, తిలక్   2–-0–-11-–1, రింకూ 1–-0–-9–-0.