న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు (ఫిబ్రవరి 16) ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల కలిగే మార్పులు, అవకాశాలు, సవాళ్లపై ప్రపంచ స్థాయి చర్చలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది.
సమ్మిట్ ముఖ్య ఉద్దేశాలు:
*ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం, భద్రత, సహకారం కోసం ఒక ఉమ్మడి మార్గదర్శకాన్ని ప్రకటించడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.
*ఉద్యోగాల్లో వస్తున్న మార్పుల నుండి పిల్లల భద్రత వరకు ఏఐ ప్రభావం చూపే అన్ని కీలక అంశాలపై ఇందులో చర్చిస్తారు.
*ఈ సదస్సులో దాదాపు 30 దేశాల నుండి 2.5 లక్షల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్ సహా 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి.
భారత్ - AI హబ్:
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారత్‌లో దాదాపు 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలు ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు.
హై అలర్ట్:
భారత్ మండపం చుట్టూ 10 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. QR కోడ్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించారు. మధుర రోడ్డు, జనపథ్ వంటి మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసారు అలాగే మెట్రో సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమయ్యే CBSE బోర్డు పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రత్యేక ప్లాన్ అమలు చేస్తున్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డ్ చూపిస్తే ట్రాఫిక్ పోలీసులు ప్రాధాన్యత ఇచ్చి పంపిస్తారు. ఈ సమ్మిట్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ AI వేదికపై బలంగా వినిపించాలని భారత్ భావిస్తోంది.
