పారిస్: ఎస్పోర్ట్స్ వరల్డ్ కప్–2026లో భారత జట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. పబ్‌జీ మొబైల్ వరల్డ్ కప్ (పీఎండబ్ల్యూసీ) గ్రాండ్ ఫైనల్స్‌కు భారత్‌కు చెందిన ఒరాంగుటాన్, గాడ్‌లైక్ ఎస్పోర్ట్స్ జట్లు అర్హత సాధించాయి. ఈ ఘనత సాధించిన తొలి భారత జట్లుగా నిలిచాయి. మొత్తం 32 జట్లు బరిలోకి దిగగా.. వాటిని 16 జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో జట్టు 12 మ్యాచ్‌లు ఆడింది.
గ్రూప్–ఏలో ఒరాంగుటాన్ 91 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ టాపర్ 4థ్రైవ్స్ కంటే 16 పాయింట్లు వెనుకబడింది. మరోవైపు గ్రూప్–బీలో గాడ్‌లైక్ ఎస్పోర్ట్స్ 105 పాయింట్లు, 73 ఫినిష్‌లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. పీఎండబ్ల్యూసీ గ్రాండ్ ఫైనల్స్ ఆగస్టు 14 నుంచి 16 వరకు జరగనున్నాయి.
భారత జట్లు టైటిల్‌తో పాటు 30 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ పూల్‌లో వాటా కోసం పోటీపడనున్నాయి. ఇతర ఈవెంట్లలో హానర్ ఆఫ్ కింగ్స్ వరల్డ్ కప్‌ను కుయిషౌ గేమింగ్ గెలుచుకుంది. టెక్కెన్–8లో ఎం.జుబేర్ సత్తాచాటి ఈడబ్ల్యూసీ–2026లో తొలి ‘జాఫోన్సో అవార్డు’ అందుకోగా.. కాల్ ఆఫ్ డ్యూటీ: బ్లాక్ ఆప్స్–7లో ఆప్టిక్ గేమింగ్ వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
