- రంగారెడ్డిలో12,86,720 ,
- మేడ్చల్ జిల్లాలో 10,73,705
- వికారాబాద్ జిల్లాలో 2,10,842 ఓట్ల తొలగింపు
ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వే, ఫీల్డ్ లెవెల్ పరిశీలన తర్వాత రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ స్థాయిలో ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 7,696,544 ఉండగా, ప్రక్రియ తర్వాత ఏకంగా 25,71,267 ఓట్లు ఎగిరిపోయాయి. ఫీల్డ్ లెవెల్లో దొరకని అడ్రస్సులు, డూప్లికేట్ ఎంట్రీలు, ఫారాలు సమర్పించని కారణంగానే భారీగా ఓట్లు కోతకు గురయ్యాయి. దరఖాస్తుల పరిశీలన ఇంకా కొనసాగుతుండడంతో తుది జాబితా నాటికి ఈ తొలగింపుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లుండగా ఇందులో 12,86,720 ఓట్లు డిలీట్కానున్నాయి. అందరికీ ఫారాలివ్వగా 24,13,023 ఫారాలు తిరిగి వచ్చాయి. ఇందులో 24,10850 (65.16శాతం) ఫారాలను డిజిటలైజ్చేశారు. 2173 ఫారాలు పెండింగ్లో ఉన్నాయి. కాగా, చేవెళ్ల నుంచి 55,610 , ఇబ్రహీంపట్నం 84,458, ఎల్బీ నగర్2,70,535, మహేశ్వరం 2,35,714, రాజేంద్రనగర్ 2,47,242, శేరిలింగంపల్లి 3,29,360, కల్వకుర్తి 28,482, షాద్ నగర్నుంచి 35,317 ఫారాలు కలెక్ట్ కాలేదు.
దీంతో ఈ ఓట్లను తొలగించినట్టే..ఫారాలు ఎక్కువగా కలెక్ట్ చేసిన నియోజకవర్గాలను చూసుకుంటే కల్వకుర్తి నుంచి అత్యధికంగా 88.39 శాతం, రెండో స్థానంలో షాద్‌నగర్ 85.55 , మూడో ప్లేస్లో చేవెళ్ల 79.70 , ఇబ్రహీంపట్నం 75.20 , రాజేంద్రనగర్ 61.08, మహేశ్వరం 58.98 , శేరిలింగంపల్లి 57.26 , ఎల్‌బీనగర్ 55.52 తో చివరి స్థానంలో నిలిచింది.
5.59 లక్షల ఓట్లు అనుమానాస్పదం
ఓటర్ల వివరాల పరిశీలనలో 5,59,923 అనామలీస్(ఓటర్ల వివరాల్లో తేడాలు/అనుమానాస్పద ఓట్లు)గా గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇవి 15.13 శాతంగా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 96,827, మహేశ్వరంలో 84,276, ఇబ్రహీంపట్నంలో 64,837, కల్వకుర్తిలో 62,929, ఎల్‌బీనగర్‌లో 59,526, శేరిలింగంపల్లిలో 70,768, షాద్‌నగర్‌లో 69,280 , చేవెళ్లలో 51,480 అనామలీస్ ఓట్లు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో సర్కు ముందు 10,17, 671 మంది ఓటర్లుండగా ఇందులో 2,10,842 ఓట్లు తొలగించనున్నారు. వీరిలో చనిపోయిన వారు, డబుల్ ఓట్లు ఉన్న వారు, మరో ప్రాంతానికి షిఫ్ట్ అయిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. 8,06, 829 మంది ఓటర్లు డిజిటలైజ్ చేసుకున్నారని చెప్పారు.
నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా తాండూర్ లో 2,52,335 మందికి 65,631 మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారు. తర్వాత పరిగిలో 2,76,260 మంది ఓటర్లకు 52,891 ఓట్లు, జిల్లా కేంద్రమైన వికారాబాద్ లో 2,37,921 ఓటర్లకు 52,380 మంది, సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో 2,51,255 మంది ఓటర్లకు గాను 39,940 మంది ఓట్లు కోల్పోయారు.
మేడ్చల్ జిల్లాలో ..
మేడ్చల్ కలెక్టరేట్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 29,79,130 కాగా, ఇందులో 10,73,705 ఓట్లు పోనున్నాయి. మొత్తం 19,04,178 ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇందులో అత్యధికంగా కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో ఓట్లు పోయాయి. ఇక్కడ మొత్తం ఓట్లు 7,47,427 కాగా, 2,77,642 ఓట్లు తొలగించారు.
తర్వాత ఉప్పల్ లో మొత్తం ఓట్లు 5,47,770 కాగా, 2,18,810 ఓట్లు, మేడ్చల్ 6,77,381 ఓట్లకు 2,13,558, మల్కాజిగిరి 5,13,144 ఓట్లకు 1,93,680, కూకట్‌పల్లి 4,93,408 ఓట్లకు 1,70,015 ఓట్లు తొలగించారు. మొత్తానికి సర్ కు ముందు ఓటర్ల సంఖ్య 29,79,130 ఉండగా, ప్రస్తుత ఓటర్ల సంఖ్య 19,04,178 కు చేరింది. పరిశీలన తర్వాత ఈ సంఖ్య ఇంకా తగ్గొచ్చు.
అత్యధికంగా మహేశ్వరంలోనే..
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో అత్యధికంగా 3,35,714 ఓట్లు పోయాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం 3,29,360 పోయిన ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
నియోజకవర్గాలు జిల్లా తొలగించిన ఓట్లు మొత్తం ఓటర్లు
మహేశ్వరం రంగారెడ్డి 3,35,714 5,74,637
శేరిలింగంపల్లి రంగారెడ్డి 3,29,360 7,73,372
కుత్బుల్లాపూర్ మేడ్చల్ 2,77,642 7,47,427
ఎల్బీనగర్ రంగారెడ్డి 2,70,535 6,08,203
రాజేంద్రనగర్ రంగారెడ్డి 2,47,242 6,35,283
ఉప్పల్ మేడ్చల్ 2,18,8105 47,770
మేడ్చల్ మేడ్చల్ 2,13,558 6,77,381
మల్కాజిగిరి మేడ్చల్ 193,680 5,13,144
కూకట్‌పల్లి మేడ్చల్ 1,70,015 4,93,408
ఇబ్రహీంపట్నం రంగారెడ్డి 84,458 3,44,584
తాండూరు వికారాబాద్ 65,631 2,52,335
చేవెళ్ల రంగారెడ్డి 55,610 2,73,883
పరిగి వికారాబాద్ 52,891 2,76,260
వికారాబాద్ వికారాబాద్ 52,380 2,37,921
కొడంగల్ వికారాబాద్ 39,940 2,51,255
షాద్ నగర్ రంగారెడ్డి 35,317 2,44,426
కల్వకుర్తి రంగారెడ్డి 28,482 2,45,355
మొత్తం 25,71,267 76,96,644
