ఫీజు బకాయిల కోసం 13న కలెక్టరేట్ల ముట్టడి...పోస్టర్ ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ నేతలు

ఫీజు బకాయిల కోసం 13న కలెక్టరేట్ల ముట్టడి...పోస్టర్ ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ నేతలు

హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ నిధుల విడుదల కోసం ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

నాగరాజు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో ఆ భారాన్ని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై మోపుతున్నాయన్నారు. స్కాలర్‌షిప్స్, రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం ఓ శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.