సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

కాంగ్రెస్ విధానాలు నచ్చి ఇతర పార్టీల కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేత వడ్డే శ్రీనివాస్.. మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి వివేక్ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, తెల్లాపూర్ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి వివేక్‌‌‌‌ హామీ ఇచ్చారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత భరత్ లాంటి యువనాయకులపైన ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతోందని కొల్లూరి భరత్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌‌‌‌చార్జి​ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి దామోదర్ సహకారంతో తెల్లాపూర్ అభివృద్ధికి పాటుపడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెల్లాపూర్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.