సూర్యాపేట, వెలుగు: లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్‌గా పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ ఎన్నికయ్యారు. సోమవారం లయన్స్ ఐ హాస్పిటల్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో చీఫ్ గెస్ట్‌గా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ పాల్గొన్నారు.
లయన్స్ ఐ హాస్పిటల్ సెక్రటరీగా పెండెం చంద్రశేఖర్, ట్రెజరర్‌గా చిలుముల సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్యామ్ ప్రసాద్, కక్కిరేణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, జాయింట్ సెక్రటరీగా దయాకర్ గుప్త, ఈసీ సభ్యులుగా వెంకటేశం గుప్తా, భోనగిరి భాస్కర్, చల్లా లక్ష్మీకాంత్, బెలిదె అంజయ్య, మిర్యాల సుధాకర్, కుమ్మరికుంట్ల లింగయ్య, ఆరె సురేశ్‌రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ధర్మారావు, గౌరవ సలహాదారులుగా గుణగంటి రాములు, మొరిశెట్టి లక్షాది, గుడిపూడి వెంకటేశ్వర రావు ఎన్నికయ్యారు.
