యంగ్‌‌ ఇండియా స్కూల్‌‌ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి

యంగ్‌‌ ఇండియా స్కూల్‌‌ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌‌, వెలుగు:పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిర్మిస్తున్న యంగ్‌‌  ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌  స్కూల్‌‌  పనులను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులు చేపట్టాలని సూచించారు. 

పేద, మధ్య తరగతి పిల్లలకు కార్పొరేట్‌‌  స్థాయి విద్యను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అనంతరం గోపాలపురం గ్రామంలో లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గురక ఆంజనేయులు, రామన్ గౌడ్, గోవింద్ గౌడ్, మహేశ్  పాల్గొన్నారు.