ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొండచరియలను కోసుకుంటూ.. పెద్ద పెద్ద రాతి గుండ్లను మోసుకొస్తున్న.. గంగమ్మతల్లి ప్రకోపం చూస్తే చిన్న పాటి వణుకు పుట్టక మానదు. నీతి లోయ ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జీ కేవలం సెకన్లలో.. రెప్పపాటులో కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు ఫుల్ గా సర్క్యులేట్ అవుతోంది.
భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. బ్రిడ్జీ కొట్టుకుపోతున్న వీడియోను ఒక వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
బ్రిడ్జీ కొట్టుకుపోవడంతో మెయిన్ టౌన్ కు రాకపోకలు కట్ అయిపోయాయి. బ్రిడ్జీ కొట్టుకుపోవడంతో.. ఆ రూట్లో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా వరదలు వస్తున్న కారణంగా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.
►ALSO READ | JPSC protests: 9 రోజులుగా దీక్ష..క్షీణించిన దేవేంద్ర మహ్తో ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
నదీ ప్రవాహ ప్రాంతాలలో.. కొండలకు దగ్గర్లో ఉన్నప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవసరం అంనుకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
2026 ఆగస్టు 09 రాత్రి నుంచి ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు వస్తున్నాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రెటరీ వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ ప్రాంతాలు తీవ్ర ప్రభావం చెందినట్లు చెప్పారు.
Nature’s force is unbelievable!
— Weather Monitor (@WeatherMonitors) August 10, 2026
Today, a sudden surge of water swept away a valley bridge and several vehicles parked nearby, as water and debris rushed through Tamakh village, Niti Valley, Chamoli district, Uttarakhand, near Joshimath, Uttarakhand, India. pic.twitter.com/9Ze2LPn2Em
