బోగోటా: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదు అయ్యింది. ఈ ఘటనలో కనీసం 20 మరణించగా.. పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. సోమవారం (ఆగస్ట్ 10) కొలంబియా రాజధాని బొగోటాకు పశ్చిమాన దాదాపు 250 మైళ్ల (400 కిలోమీటర్ల) దూరంలో ఉన్న శాన్ జోస్ డెల్ పాల్మార్ అనే గ్రామంలో ఈ భారీ భూకంపం సంభవించింది.
ఈ భూకంప కేంద్రం భూమికి 107 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన ప్రకంపనల ధాటికి పలు చోట్ల భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో పలువురు శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అత్యవసర సహయక బృందాలు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రజలను భూకంప ప్రభావిత ప్రాంతాలను నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
►ALSO READ | రష్యా భూభాగంలో ఉక్రెయిన్ డ్రోన్ల విధ్వంసం.. ఆయిల్ రిఫైనరీయే టార్గెట్.. చిన్నారితో సహా 13 మంది మృతి
ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందికి పైగా మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప ప్రభావం కొలంబియా పొరుగు దేశమైన ఈక్వెడార్‌లో కూడా కనిపించింది. ఈక్వెడార్ లో కూడా పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
