ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్లు .. 21 మంది తెలంగాణ వాసులు అరెస్ట్

ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్లు .. 21 మంది తెలంగాణ వాసులు అరెస్ట్

తెలంగాణ ప్రజలను టార్గెట్‌గా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్‌ సెంటర్ల నెట్‌వర్క్‌ను టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విజయవంతంగా ఛేదించారు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తున్న మూడు నకిలీ కాల్‌ సెంటర్లపై పోలీసులు ఉమ్మడి దాడులు నిర్వహించారు. ప్రసిద్ధ ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ పేరుతో ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆకర్షణీయమైన లోన్లు మంజూరు ఆఫర్లను ప్రకటిస్తూ అమాయకులను ఆకర్షించారు.

లోన్‌ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ ఫీజులు, బీమా ప్రీమియం పేరిట బాధితుల నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో ఈ మూడు కాల్‌ సెంటర్‌లను నిర్వహిస్తున్నట్లు తేలింది. 

►ALSO READ | లాల్ దర్వాజ్ రంగం: కలికాలంలో పాపాలు పెరిగాయి ..మాతంగి అనురాధ భవిష్యవాణి

ఈ దాడుల్లో 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు ఒక బ్యాంకు ఖాతాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన టెలికాలర్లంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. అయితే, ఈ రాకెట్‌కు ప్రధాన నిర్వాహకులుగా ఉన్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు.