పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. బిగ్ స్క్రీన్‌పై తమ టాలెంట్ ను నిరూపింపుకోవాలనుకునే ఔత్సాహిక నటీనటులకు కూడా ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 AD'ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెట్టి నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ ప్రపంచం ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే యూనివర్స్‌లోకి కొత్త నటీనటులను ఆహ్వానిస్తున్నారు మేకర్స్.
'కల్కి 2' కోసం కాస్టింగ్ కాల్....
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'కల్కి 2' కోసం లేటెస్ట్ గా అధికారిక కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ముఖ్యంగా వయసుతో సంబంధం లేదు.. లింగ పరిమితులు లేవు.. మీలో టాలెంట్ ఉంటే చాలు అంటూ మేకర్స్ చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంటే.. నటనపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ అవకాశం కోసం ప్రయత్నించొచ్చు.
ఆసక్తి ఉన్న నటీనటులు తమ ప్రొఫైల్, పోర్ట్‌ఫోలియో, నటనకు సంబంధించిన వివరాలను kalkiuniversecasting@gmail.comకు పంపించాలని మేకర్స్ సూచించారు. అయితే ఏయే పాత్రల కోసం ఈ కాస్టింగ్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు.
►ALSO READ | Spider-Man Box Office: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్.. రూ.500 కోట్లతో హాలీవుడ్ రికార్డ్ బ్రేక్!
'కల్కి 2'పై క్యూరియాసిటీ..
ఇక 'కల్కి 2898 ఏడీ' ఎంత పెద్ద హిట్ అంటే.. ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్‌గా, దీపికా పదుకొనే సుమతిగా కనిపించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000 కోట్లకు పై వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ముఖ్యంగా తొలి భాగం చివర్లో ఇచ్చిన ట్విస్టులు.. భైరవ పాత్ర వెనుక ఉన్న అసలు రహస్యం.. కమల్ హాసన్ పోషించిన సుప్రీమ్ యాస్కిన్ పాత్రకు సీక్వెల్‌లో ఉండబోయే ప్రాధాన్యత.. ఇవన్నీ 'కల్కి 2'పై క్యూరియాసిటీని అమాంతం పెంచేశాయి.
ఆ 'ఒక్క ఛాన్స్' ..
ఇప్పుడు ఆ క్రేజీ యూనివర్స్‌లో కొత్త ముఖాలకు చోటు దక్కనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పటి నుంచో సినిమాల్లో నటించాలంటూ 'ఒక్క ఛాన్స్' కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభాస్ 'కల్కి 2'లో ఆ ఒక్క ఛాన్స్ వచ్చేస్తుందేమో. మరి మీ టాలెంట్‌పై మీకు నమ్మకం ఉంటే.. ఆలస్యం చేయకుండా మీ ప్రొఫైల్ పంపించేయండి. 'కల్కి2' సినిమాలో ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం మీకే దక్కొచ్చు.
Here’s an opportunity for all aspiring actors!
— Kalki 2898 AD (@Kalki2898AD) August 10, 2026
Come be a part of the KALKI CINEMATIC UNIVERSE.
📩 kalkiuniversecasting@gmail.com#Kalki2898AD #CastingCall pic.twitter.com/hUKIoRfv2k
