T20 World Cup: ఆస్ట్రేలియా ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

T20 World Cup: ఆస్ట్రేలియా ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

కొలంబో: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో ఆస్ట్రేలియా రాణించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 20 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత మూడు వికెట్లు తీశాడు. చమీర 2 వికెట్లు పడగొట్టగా.. వెల్లలాగే, మహేష్ తీక్షణ, కమిందు మెండిస్ తలో వికెట్ సాధించారు.

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. భారీ స్కోర్ దిశగా సాగుతోన్న ఆస్ట్రేలియాను దుషన్ హేమంత దెబ్బకొట్టాడు. 

వెంట వెంటనే మార్ష్, హెడ్‎ను ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ (3), టిమ్ డేవిడ్ (6) తీవ్రంగా నిరాశపర్చారు. ఈ క్రమంలో ఇంగ్లీస్ (27), మ్యాక్స్ వెల్ (22) ఆదుకున్నారు. మొదట్లో ధారళంగా రన్స్ ఇచ్చిన శ్రీలంక బౌలర్లు  చివర్లో పుంజుకుని ఆస్ట్రేలియాను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. 

ఇక, ఈ మ్యాచులో అతిథ్య శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ పేసర్  మతీష పతిరణ గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవిలలాడటంతో ఫిజియోలు వచ్చి గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. నొప్పి తీవ్రంగా ఉండటంతో సరిగ్గా నడవలేకపోయాడు. దీంతో అతడు మళ్లీ బౌలింగ్‎కు రాలేదు.