హోవ్: ఇంగ్లండ్ వన్డే కప్‌లో హాంప్‌షైర్ బ్యాటర్ టోబీ ఆల్బర్ట్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ససెక్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. రెండు ఓవర్లలో కలిపి వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపిన ఆల్బర్ట్.. 37 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు.
అతడి మెరుపులతో హాంప్‌షైర్ 383/9 భారీ స్కోరు సాధించి, అనంతరం ససెక్స్‌ను 51 పరుగుల తేడాతో ఓడించింది. 43వ ఓవర్ చివరి రెండు బంతులను నాంటెస్ ఊస్ట్‌హుయిజెన్ బౌలింగ్‌లో ఆల్బర్ట్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్‌లో ఆలీ కిర్ట్లీ వేసిన తొలి నాలుగు బంతులనూ సిక్సర్లుగా బాదాడు.
దీంతో వరుసగా ఎదుర్కొన్న ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు నమోదు చేశాడు. ఈ ఏడాది వన్డే కప్‌లో 50కిపైగా స్కోరు చేసిన బ్యాటర్లలో ఆల్బర్ట్‌దే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. హాంప్‌షైర్ లిస్ట్- ఏ చరిత్రలో 383 పరుగులు రెండో అత్యధిక స్కోరు. ఈ విజయంతో హాంప్‌షైర్ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
