పాకిస్తాన్ దేశంలో వింత పరిస్థితి.. టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్ జట్టు. 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఓడిన వెంటనే చాలా మంది యువత.. తమ తమ టీవీలను బద్దలు కొట్టారు. క్రికెట్ బ్యాట్లతో.. కర్రలతో.. టీవీలను బద్దలుకొట్టారు.
పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో టీవీలు పగిలిపోయినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పాక్ జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వకపోవటాన్ని మరింతగా జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ వన్ సైడ్ గా జరిగిందని.. పాకిస్తాన్ ఆటగాళ్లు కనీసం ఫైట్ కూడా చేయలేదని.. స్టార్టింగ్ నుంచే చేతులెత్తేశారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాకిస్తాన్ ఓడిపోయింది.. నేను కోపంతో.. నిరాశతో నా టీవీని పగలగొట్టాను అంటూ ఆజామ్ అనే కుర్రోడు FBలో పోస్ట్ చేశాడు. జస్ట్ టీవీని బద్దలుకొట్టటమే కాదు.. ప్రస్టేషన్.. కోపం.. ఆవేశంగా దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టటం అనేది అతనిలోని కసిని చూపిస్తుంది.
ఇండియాతో మ్యాచ్ అంటే హై ఓల్టేజ్.. గెలిచినా.. ఓడినా ఓ కిక్కు అయితే ఉంటుంది. అలాంటిది ఇండియా చేతిలో వన్ సైడ్.. అది కూడా 61 పరుగుల తేడాతో ఓడిపోవటంతో.. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్.. ఓటమిని తట్టుకోలేక.. ప్రస్టేషన్ లో టీవీలను పగలగొట్టారు. చాలా మంది ఫ్యాన్స్ ఇలాగే చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ తర్వాత.. ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. కుర్రోళ్లు వీధుల్లో టపాసులు కాల్చారు.. జై భారత్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు తీశారు. పాకిస్తాన్ లో నిశ్సబ్ధం.. నిరాశ అలుముకున్నది.
