T20 World Cup: శ్రీలంకకు బిగ్ షాక్: గాయంతో మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‎లో కుప్పకూలిన స్టార్ బౌలర్

T20 World Cup: శ్రీలంకకు బిగ్ షాక్: గాయంతో మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‎లో కుప్పకూలిన స్టార్ బౌలర్

కొలంబో: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం (ఫిబ్రవరి 16) శ్రీలంక, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచులో అతిథ్య శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ పేసర్  మతీష పతిరణ గాయపడ్డాడు. 

బౌలింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవిలలాడటంతో ఫిజియోలు వచ్చి గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. నొప్పి తీవ్రంగా ఉండటంతో సరిగ్గా నడవలేకపోయాడు. దీంతో అతడు మ్యాచులో మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం కనిపించట్లేదు. 

ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 18 ఓవర్లకు 174 రన్స్ చేసింది.  క్రీజులో జోష్ ఇంగ్లీస్ (27), మార్కస్ స్టోయినిస్ (2) ఉన్నారు.