ఆప్ఘానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచులో ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు. అఫ్గాన్ తరఫున 191 వికెట్లు, మిగిలిన 509 వికెట్లు ఐపీఎల్ వంటి లీగ్‌లలో సాధించాడు.
రషీద్ ఖాన్ తర్వాత టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజాలు బ్రావో (631), నరైన్ (613*) ఉన్నారు. ఒకే ఫార్మాట్లో 700 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన రషీద్ ఖాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మనిషివా.. మిషన్వా.. బ్రో అంటూ ఫన్నీగా అభినందిస్తున్నారు.
ఇక మ్యా్చ్ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 16) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచులో యూఏఈపై ఆప్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో యూఏఈను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది. అనంతరం 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘానిస్తాన్ లక్ష్యాన్ని ఛేధించింది. 4 వికెట్లు, 40 పరుగులతో ఆల్ రౌండ్ షో చేసిన అజ్మాతుల్లా ఒమర్జాయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
