Chiranjeevi Health: చిరంజీవి భుజానికి సర్జరీ.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!

Chiranjeevi Health: చిరంజీవి భుజానికి సర్జరీ.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!

కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. అభిమానులు ఆందోళన చెందుతారు. లేటెస్ట్ గా చిరు పోల్డర్ బ్యాగ్ వేసుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తమ అభిమాన నటుడికి ఏమైంది అని కంగారు పడ్డారు. దీంతో తన ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి స్వయంగా  క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?

ఇటీవల అల్లు అరవింద్ తన తనయుడు అల్లు శిరీష్ వివాహ వేడుకకు సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందించారు. అల్లు కుటుంబ సభ్యులందరూ చిరు నివాసానికి వెళ్లి శుభలేఖ అందించిన ఫోటోలను శిరీష్ తన అభిమానులతో పంచుకున్నారు.  ఆ ఫోటోల్లో చిరంజీవి భుజానికి పోల్డర్ బ్యాగ్ఉండటం చూసి మెగా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఏమైందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

క్లారిటీ ఇచ్చిన చిరు .

అభిమానుల ఆందోళనను గమనించిన చిరంజీవి వెంటనే స్పందించారు. తనకు ఒక చిన్న షోల్డర్ కీ-హోల్ సర్జరీ (Arthroscopy) జరిగిందని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. "నా చేతికి పట్టీ ఉండటం చూసి చాలా మంది ఆరా తీశారు. భుజానికి చిన్న సర్జరీ జరిగింది. ఇప్పుడు నేను బాగానే కోలుకుంటున్నాను. ఇప్పటికే నా దినచర్యను మళ్ళీ మొదలుపెట్టాను. నాకు చికిత్స చేసిన డాక్టర్ నితిన్‌కు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, దీవెనలకు నేను ఎంతో రుణపడి ఉంటాను" అని ఎక్స్‌ వేదికగా చిరు పేర్కొన్నారు.

 

విజయపథంలో 'మన శంకరవరప్రసాద్ గారు'

చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. మెగాస్టార్ తన మార్కు యాక్షన్, ఎమోషన్స్‌తో అలరించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు. 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఎనర్జీ చూసి కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో కూడా రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

 బాబీ దర్శకత్వంలో..

ఈ విజయోత్సాహంతో చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు బాబీతో చిరు మరోసారి జతకట్టబోతున్నారు. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. సర్జరీ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని, చిరు మళ్ళీ మేకప్ వేసుకోనున్నారు. మెగాస్టార్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, మళ్ళీ వెండితెరపై తన మేజిక్ చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.