టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. ' దసరా ' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపుతోంది.
గూస్ బంప్స్ తెప్పించే ఇంట్రో సాంగ్!
మాస్ ఆడియెన్స్ కు ఫుల్ కిక్కిచ్చే అప్డేట్ ఒకటి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇచ్చారు. ఈ మూవీలోని నాని ఇంట్రడక్షన్ సాంగ్ ఆయా షేర్ రికార్డింగ్ వర్క్ శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఆయా షేర్ సాంగ్ ఊరమాస్ బీట్ తో ఉండబోతుంది అని చెప్పారు. ధూమ్ ధామ్.. తహా తహా.. ఇప్పుడు 'ఆయా షేర్'తో మరింత మాస్‌గా మారబోతోంది. ఆ ప్రత్యేక రోజున దేశం మొత్తం ఈ ట్యూన్‌కు స్టెప్పులు వేస్తుంది" అంటూ శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.
థియేటర్లు దద్దరిల్లేలా..
ఈ పవర్‌ఫుల్ మాస్ కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. నాని ఎనర్జీకి అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. 'ద పారడైజ్' కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఒక సామాజిక పోరాటం కోణంలో కూడా తెరకెక్కించారు . ప్రాథమిక హక్కులకు దూరంగా ఉన్న ఒక వెనుకబడిన గిరిజన తెగ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారి కోసం, వ్యవస్థను ఎదిరించి న్యాయం పోరాటం చేసే నాయకుడిగా నాని పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
నాని సరసన కాయడు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్,బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026కి వాయిదా వేశారు. మేము హడావిడి పడాలనుకోవడం లేదు. ఒక అద్భుతమైన అవుట్‌పుట్ ఇవ్వడానికి మాకు సమయం కావాలి అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ఆగస్టు విండోలో ఓనమ్, రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పండుగలు ఉండటం సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ కానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
