'తిరుమణం ఎన్నుమ్ నిక్కా' తమిళ మూవీతో సినీరంగం లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. 'అలా ఎలా?' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ. 'కుమారి 21 ఎఫ్' తో ఊహించని పాపు లారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుని తనుకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
అయితే షార్ట్ టైంలోనే పుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైంది. 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తన నటనతో మరో సారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన 'ఓదెలా 2'లోనూ మంచి పాత్రతో ప్రేక్షకులను మెప్పించిం ది. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టు ల్లో నటిస్తున్నట్లు సమాచారం.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్.. రోజుకు ఒక గ్లామర్ ఫొటోతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా షేర్ చేసిన పిక్సె నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. రెడ్ కలర్ లెహంగా.. జడలో పువ్వులతో అందంగా ముస్తాబైయింది. సంప్రదాయ జుమ్కాలు. గాజులతో ట్రెడిషనల్ వేర్ లో లో రెడీ అయింది. కుర్రకారు మతిని చెడ గొడుతోంది.
