ఖమ్మం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అం దిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లిన వారికి ఈ రిజల్ట్ చెంపపెట్టు అని అన్నారు. మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. ‘మున్సిపల్ తీర్పుతో ప్రతిపక్షాల నోరు మూత పడింది.
రాష్ట్రవ్యా ప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలి టీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయం. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్ట బెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. గడిచిన రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి సార థ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పని చేస్తూ.. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్లి, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారు. 2,047 నాటికి 3 త్రిలియన్ డాలర్ ఎకాన మీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తం. మా పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతోనే. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణ ను గ్లోబల్ హబ్ మారుస్తం' అని అన్నారు.
