సోమవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. శివరాత్రి తర్వాత ఏపీ తెలంగాణలో రేట్లు ఇవే..

సోమవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. శివరాత్రి తర్వాత ఏపీ తెలంగాణలో రేట్లు ఇవే..

శివరాత్రి పండుగ తర్వాత బంగారం, వెండి ధరలు గతంలో కంటే తగ్గుతున్నాయి. ప్రస్తుత రేట్ల తగ్గింపులు తాత్కాలికమైనదేనని.. భవిష్యత్తులో రేట్లు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారం, వెండి తాజా రేట్లను పరిశీలించి కొనుగోలుదారులు షాపింగ్ చేయటం ఉత్తమం తమ ప్రాంతాల్లో.

ఫిబ్రవరి 16న బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలతో వినియోగదారులకు ఊరటను అందించాయి. దీంతో ఫిబ్రవరి 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.131 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 644గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 340గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీ కొంత నెమ్మదించిందని నిపుణులు అంటున్నారు. అయితే సోమవారం ఫిబ్రవరి 16, 2025న వెండి రేటు కేజీకి రూ.7వేలు తగ్గి ఊరటను ఇచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 80వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.280 వద్ద ఉంది.