T20 World Cup: పాక్‎ను మట్టికరిపించి సూపర్-8కు టీమిండియా.. నెక్ట్స్ రౌండ్‎లో ఏ జట్లతో తలపడనుందంటే..?

T20 World Cup: పాక్‎ను మట్టికరిపించి సూపర్-8కు టీమిండియా.. నెక్ట్స్ రౌండ్‎లో ఏ జట్లతో తలపడనుందంటే..?

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‎లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. 2026, ఫిబ్రవరి 15న కొలంబోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎ను మట్టికరిపించింది. బ్యాటింగ్‎లో జార్ఖండ్ డైనమేట్ ఇషాన్ కిషాన్ హడలెత్తించగా.. భారత బౌలర్లు సమిష్టిగా పాక్ బ్యాటర్ల భరతం పట్టడంతో టీమిండియా సగర్వంగా గ్రూప్ 8కు అర్హత సాధించింది. 

సూపర్ 8లో తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు బుధవారం (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తమ చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‎లో నెదర్లాండ్స్‌తో ఇండియా తలపడనుంది. ఇదిలా ఉంటే.. సూర్య కుమార్ సేన సూపర్ 8లో భాగంగా ఏ జట్లతో తలపడనుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే.. సూపర్ 8 పోరులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా/ జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో టీమిండియా తలపడనుంది. 

ఓటమి ఎరగకుండా గ్రూప్ దశను ముగించిన టీమిండియా.. సూపర్ 8లోనూ అదే జోష్ చూపించి సెమీస్ చేరాలని భావిస్తోంది. అయితే.. సూపర్ 8 పోరు టీమిండియాకు అంత సులభం కాదు. సూపర్ 8 స్టేజ్‎లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి బలమైన జట్ల నుంచి సూర్య కుమార్ సేనకు సవాల్ ఎదురుకానుంది. మరీ ఈ జట్లను భారత్ ఏ విధంగా ఎదుర్కొని టోర్నీలో ముందుకు సాగుతోందో చూడాలీ..

సూపర్ 8లో టీమిండియా తలపడనున్న మ్యాచులు ఇవే:

  • ఇండియా vs సౌతాఫ్రికా (ఫిబ్రవరి 22, అహ్మదాబాద్)
  • ఇండియా vs జింబ్వాబే/ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 26, చెన్నై)
  • ఇండియా vs వెస్టిండీస్ (మార్చి 1, కోల్‌కతా)