ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్: అరుంధతి అదుర్స్‌‌‌‌.. తొలి టీ20లో ఆసీస్‌‌‌‌పై ఇండియా గెలుపు

ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్: అరుంధతి అదుర్స్‌‌‌‌.. తొలి టీ20లో ఆసీస్‌‌‌‌పై ఇండియా గెలుపు

సిడ్నీ: ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌ను ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్ ఘన విజయంతో షురూ చేసింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) నాలుగు వికెట్లతో విజృంభించడంతో మూడు టీ20ల సిరీస్‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో 21 రన్స్ తేడాతో (డక్‌‌‌‌వర్త్ లూయిస్‌‌‌‌ ) ఆసీస్‌‌‌‌ను ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో  టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా18 ఓవర్లలో 133 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది.

అరుంధతి, రేణుకా సింగ్ (2/14), శ్రీచరణి (2/14) వరుస వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ను దెబ్బకొట్టారు. జార్జియా వారెహమ్ (30), ఫోబ్ లిచ్‌‌‌‌ఫీల్డ్ (26) రాణించారు.ఛేజింగ్‌‌‌‌లో షెఫాలీ వర్మ (21), స్మృతి మంధాన (16 నాటౌట్‌‌‌‌) మెరుపులతో  ఇండియా 5.1 ఓవర్లలో 50/1తో జోరుమీద ఉన్నప్పుడు వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. డక్‌‌‌‌వర్త్ ప్రకారం అప్పటికి  టార్గెట్‌‌‌‌ను 29 రన్స్ గా లెక్కగట్టారు. 21 రన్స్ ఆధిక్యంతో ఉన్న ఇండియానే విజయం వరించింది. అరుంధతికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.