తిమ్మాపూర్: ఉన్నత విద్యకు ఊతం.. స్టూడెంట్లకు స్కాలర్షిప్స్

తిమ్మాపూర్: ఉన్నత విద్యకు ఊతం.. స్టూడెంట్లకు స్కాలర్షిప్స్
  • అందజేస్తున్న షాలిని యాజమాన్యం

తిమ్మాపూర్, వెలుగు: పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుడదనే ఉద్దేశంతో స్కాలర్​షిప్స్​అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది షాలిని విద్యాసంస్థల ట్రస్ట్. తమ జ్యోతిష్మతి కాలేజీల్లో బీటెక్​చదివే విద్యార్థులకు ఏటా రూ.18వేల స్కాలర్​షిప్స్​అందిస్తామని, కాలేజీలో చేరిన దాదాపు 400 మందికి రూ.72 లక్షలు అందజేస్తోంది. ఇందులో భాగంగా గురువారం 82 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో విద్యాసంస్థల చైర్మన్​ జువ్వాడి సాగర్​రావు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన​మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేలా తమవంతు ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. 

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని షాలిని ట్రస్ట్​ స్కాలర్​షిప్స్​ అందజేయడం సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల యాజమాన్యం, చైర్మన్​సాగర్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.