సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయల్దేరారు. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారాతో కలిసి పయనమయ్యారు. సోమవారం (డిసెంబర్ 29న) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇందులో సితార, తన తండ్రి మహేష్ బాబు స్టైల్‌ను మ్యాచ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహేష్ బాబు సింపుల్ అయినా స్టైలిష్ లుక్‌లో కనిపించగా, అదే తరహా డ్రెస్‌లో సితార కూడా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. నీలిరంగు టీ-షర్ట్, గోధుమ రంగు జాకెట్ మరియు జీన్స్ ధరించి, సన్ గ్లాసెస్ మరియు మహేష్ ట్రేడ్మార్క్ క్యాప్ ధరించి కనిపించాడు. తెల్లటి టీ-షర్టులో టోపీ మరియు సన్ గ్లాసెస్ ధరించి తండ్రి మహేష్ లుక్కు దగ్గరగా సితార కనిపిస్తోంది. ఈ క్రమంలో తండ్రి-కూతురు స్టైల్ మ్యాచ్ చూసిన అభిమానులు “డాడ్ కాపీ పేస్ట్” అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.
Babu back to vacation for a short break ❤️
— Daring & Dashing MBFC™ (@dashing_tm) December 29, 2025
It’s time for New Year Celebrations 🌝@urstrulyMahesh #Varanasi
pic.twitter.com/9pIxLuzVEE
నమ్రత శిరోద్కర్, గౌతమ్ కూడా కూల్ ట్రావెల్ లుక్‌లో కనిపించారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి భారీ స్పందనను రాబడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ ఫ్యామిలీ విదేశీ వెకేషన్‌కు వెళ్లినట్లు సమాచారం.
►ALSO READ | Akhanda 2: ‘అఖండ 2’ చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. బాలకృష్ణ నటనపై ప్రశంసలు!
వారణాసి మూవీ గురించి:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఇప్పటికే వారణాసి టీజర్ రాకతో మూవీపై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి ఛాయలున్న రుద్రుడిగా కనిపించబోతున్నారు. మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ మహేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు.
