నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ చిత్రం‘‘అఖండ 2’’ (Akhanda 2). డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు, సనాతన ధర్మ రక్షణ కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది.
ఈ తరుణంలోనే సోమవారం (డిసెంబర్ 29న) "అఖండ 2" సినిమాను కేంద్ర మంత్రి బండి సంజయ్ వీక్షించారు. దర్శకుడు బోయపాటితో కలిసి బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా చూసి ఫిదా అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖండ 2 చిత్ర బృందాన్ని, ముఖ్యంగా బాలకృష్ణ నటనను ప్రశంసించారు.
‘‘అఖండ 2 అద్బుతమైన సినిమా అని, బాలకృష్ణ నటనలోని పవర్, ఆధ్యాత్మిక భావం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అలాగే "ప్రతి ఒక్క హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన మూవీ. ధర్మం దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠం. సనాతన ధర్మ రక్షణ అవసరాన్ని నొక్కి చెప్పిన సినిమా ఇదని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని’’ బండి సంజయ్ కోరారు.
Akhanda 2 isn’t just a film. It’s a statement. Not preachy. Not confused. Just firm in what it wants to say.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 29, 2025
A film that reminds people why Sanatana Dharma has survived centuries of pressure.
Cinema like this takes courage. It speaks about responsibility, faith, and standing up… pic.twitter.com/tKxBdscBDy
ఈ క్రమంలోనే సనాతన ధర్మ రక్షణ గురించి చెబుతూ..‘‘ఇప్పటికైనా హిందూ ధర్మమనే గొడుగు కిందకు అందరూ రావాలని కోరుతున్నట్లు బండి సంజయ్ కోరారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ప్రధాని నరేంద్రమోడీ ఒక్కరే అని, ఆయన పాలనలో కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించగలిగాం’’ బండి సంజయ్ వెల్లడించారు.
►ALSO READ | PEDDI: అసలు ఇతను జగ్గూభాయేనా? ‘పెద్ది’లో అప్పలసూరిగా షాకింగ్ మేకోవర్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ అఖండ 2 రివ్యూ: కేంద్ర మంత్రి బండి సంజయ్ X వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ, సినిమా రివ్యూ పంచుకున్నారు. ‘‘దర్శకుడు బోయపాటి శ్రీను గారితో కలిసి అఖండ 2: తాండవం చూశాను. అఖండ 2 కేవలం ఒక సినిమా కాదు. అది ఒక ప్రకటన. అది నీతులు చెప్పదు. గందరగోళానికి గురి చేయదు. శతాబ్దాల ఒత్తిడిని తట్టుకుని సనాతన ధర్మం ఎందుకు నిలబడిందో ప్రజలకు గుర్తుచేసే చిత్రం ఇది. ఇలాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. ఇది బాధ్యత, విశ్వాసం మరియు ధర్మం వైపు నిలబడటం గురించి మాట్లాడుతుంది. నందమూరి బాలకృష్ణ గారు తెరపై ఆధిపత్యం చెలాయిస్తారు. శక్తివంతంగా మరియు రాజీపడకుండా సినిమా స్థాయిని పెంచారు. ఎస్. ఎస్. తమన్ గారి సంగీతం సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది’’ అని బండి రివ్యూ ఇచ్చారు.
Akhanda 2 isn’t just a film. It’s a statement. Not preachy. Not confused. Just firm in what it wants to say.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 29, 2025
A film that reminds people why Sanatana Dharma has survived centuries of pressure.
Cinema like this takes courage. It speaks about responsibility, faith, and standing up… pic.twitter.com/tKxBdscBDy
