న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో భాగంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేళ సైబరాబాద్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు నిబంధనలు విధించారు. ప్రజా భద్రత దృష్ట్యా ORR లోపల సైబరాబాద్ పరిధిలో C&D కన్స్ట్రక్షన్ అండ్ మెటీరియల్స్ తరలించే వాహనాలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు .రాత్రి 10:30 నుంచి 2:00 గంటల వరకు రవాణాపై ఆంక్షలు విధించారు.
ఇప్పటికే న్యూ ఇయర్ వేడులక సందర్భంగా కీలక సూచనలు చేశారు సైబరాబాద్ పోలీసులు. క్యాబ్ లు,ట్రాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు, ఆపరేటర్లు యూనిఫాం ధరించాలని సూచించారు. వాహనాలకు అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉండాలని చెెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికుల రైడ్ లను క్యాన్సిల్ లేదా రిజెక్ట్ చేయకూడదని తెలిపారు. ఒక వేళ అలా చేస్తే మోటార్ వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 178 ఉల్లంఘన అవుతుందని.. ఈ చలాన్ రూపంలో జరిమానా విధిస్తామని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలుకే
న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా నగర వాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడితే జైల్లో వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రై నడుస్తోందని చెప్పారు. జనవరి 1వ తేదీ వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రై నిర్వహిస్తామన్నారు. న్యూ ఇయర్ రోజు ఫ్యామిలీతో ఉంటారా లేక డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి జైల్లో ఉంటారా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. డేంజరస్, డ్రైవింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఎవ్వరు ప్రోత్సహించకూడదని సూచించారు.
