తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు విజయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు విజయం

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఏడాది పాటు సురేష్ బాబు ఈ పదవిలో ఉండనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, ట్రెజరర్‎గా ముత్యాల రామ్ దాస్ ఎన్నికయ్యారు. 

ఆదివారం (డిసెంబర్ 28) ప్రొగ్రెసివ్ ప్యానల్, మన ప్యానెళ్ల మధ్య ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. మన ప్యానల్ నుంచి చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి బడా నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రొడ్యూసర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మొత్తం నాలుగు సెక్టార్లలో 48 మంది కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి.

ప్రొగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి.సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్  ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఓవరాల్‌గా 48 మంది కార్యవర్గానికి ప్రొగ్రెసివ్ ప్యానెల్‎లో 31 మంది, మన ప్యానెల్‎లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వివరాలు:

ప్రొడ్యూసర్స్ సెక్టార్:

ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు గెలుపొందారు

మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు

స్టూడియో సెక్టార్:

మన ప్యానెల్ నుంచి ముగ్గురు 

ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒక్కరు..

ఎగ్జిబిటర్స్ సెక్టార్:

ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 14 మంది గెలిచారు
 మన ప్యానెల్ నుంచి 2 సభ్యులు గెలుపొందారు.

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్:

మొత్తం12 ఈసీ మెంబర్స్‎కు గానూ..
ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది గెలిచారు.
మన ప్యానెల్ నుంచి 3 సభ్యులు గెలిచారు.
ఒకటి టై గా నిలిచింది.