Alia Bhatt : 'గాన్ గర్ల్' ట్రోల్స్‌పై అలియా భట్ షాకింగ్ రియాక్షన్.. నేనేమీ అంత కూల్ కాదు!

Alia Bhatt : 'గాన్ గర్ల్' ట్రోల్స్‌పై అలియా భట్ షాకింగ్ రియాక్షన్.. నేనేమీ అంత కూల్ కాదు!

రీసెంట్ గా జరిగిన బాఫ్టా 2026 అవార్డుల వేడుకలో తన అందంతో మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.  అయితే గ్లోబల్ వేదికపై ఈ అమ్మడు 'గాన్ గర్ల్' సినిమాపై చేసిన కామెంట్లపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. అలియా భట్ ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్ చూసి, అసలు ఆమె ఆ చిత్రం చూశారా? లేదా కావాలనే ఇంటర్నేషనల్ స్టార్ లా పోజు కొడుతున్నారా? అంటూ ట్రోల్ చేశారు. దీనిపై నెట్టింట పెద్ద చర్చే నడిసింది.

అయితే వాటిపై అలియా లేటెస్ట్ గా స్పందించిం ది. 'దీని గురించి ఇంతగా ఎందుకు చర్చించుకుంటున్నారు? నా ఎక్స్‌ప్రెషన్స్  వల్లేనా? నిజానికి 'గాన్ గర్ల్' మూవీ సినిమా విడుదలై పదేండ్లు దాటిపో యింది. నేను ఆ మూవీ చూసి కూడా చాలా కాలమైంది. ఇంటర్వ్యూయర్ సినిమాలో మోనోలాగ్, ఫ్లోర్ క్లీన్ చేసే సీన్ గురించి అడుగుతుంటే.. నా మెదడు పాత జ్ఞాపకాలను వెత క్కోవడానికి పదేళ్ల వెనక్కి వెళ్లింది అని చెప్పుకొచ్చింది..

 ఆ సమయంలో నా ముఖంలో కనిపించిన తడబాటు అదే. నిజం చెప్పాలంటే నేను అంత కూల్ అమ్మాయిని ఏమీ కాదు అని చెప్పుకొచ్చిందీ అలీయాభట్. నా సోదరి చెప్పినట్లు నేను చాలా 'అన్ కూసూల్ పర్సన్ ని' అంటూ నవ్వుతూ రిప్లే ఇచ్చింది. ఇదిలా ఉంటే, అలియా భట్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వస్తున్న లేడీ ఓరి యెంటెడ్ స్పై థ్రిల్లర్ 'ఆల్పా" లో ఈ బ్యూటీ నటిస్తోంది.