కాకా వెంకటస్వామి చొరవ తీసుకోకపోతే ఇవాళ ఉప్పల్ స్టేడియం ఉండేది కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాకా మెమోరియల్ సెకండ్ ఫేజ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. మెదక్, వరంగల్ మ్యాచ్ ను మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. 200 మంది క్రికెటర్లు ఈటోర్నమెంట్ లో పాల్గొన్నారని చెప్పారు. ఈ టోర్నమెంట్ యంగ్ ప్లేయర్స్ కి మంచి అవకాశమని చెప్పారు. క్రికెట్ ను రాష్ట్రంలో మరింత పెంచాలని తమ ఆలోచన అని తెలిపారు. జిల్లాల నుంచి కూడా స్టేట్ కమిటీకి సెలక్ట్ అయ్యేలా చూస్తామన్నారు. ప్రోత్సాహం లేకపోతే మంచి ఆటగాళ్లు బయటకు రారని చెప్పారు. మారుమూల క్రీడాకారులకు ఈ టోర్నమెంట్ మంచి అవకాశమన్నారు. ఈ టోర్నమెంట్ లో 104 మ్యాచ్ లు కండక్ట్ చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కాకా స్ఫూర్తితోనే విశాక ఇండస్ట్రీ ముందుకొచ్చిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో మంచి స్టేడియం కట్టబోతున్నామని తెలిపారు . రానున్న రోజుల్లో మహిళలకు కూడా టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు వివేక్.
మహిళలకు టోర్నమెంట్ పెట్టాలి : గుత్తా
మహిళలను కూడా ప్రోత్సహించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంచి ప్లేయర్స్ ను వెలికి తీయాలని సూచించారు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ లో మొదటి దశలో చాలా మంది క్రీడాకారులు ఆడారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తయారు చేయడమే వివేక్ వెంకటస్వామి లక్ష్యమని అన్నారు. మహిళల కోసం కూడా టోర్నమెంట్ పెట్టే ఆలోచన చేయాలని సూచించారు గుత్తా సుఖేందర్ .
