తెలంగాణ అసెంబ్లీ: అలా వచ్చి ఇలా వెళ్లిన కేసీఆర్.. మూడు అంటే 3 నిమిషాలే సభలో..

తెలంగాణ అసెంబ్లీ: అలా వచ్చి ఇలా వెళ్లిన కేసీఆర్.. మూడు అంటే 3 నిమిషాలే సభలో..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి.. సభలో జాతీయ గీతం అలాపన అయిపోగానే బయటకు వెళ్లిపోయారు. సభలో ఆయన మూడు అంటే 3 నిమిషాలే ఉన్నారు. కనీసం దివంగత సభ్యుల సంతాప తీర్మానం కూడా వినలేదు.

 

కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన వెంటనే వెళ్లిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. మరోవైపు కేసీఆర్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష నేతగా సభలో దివంగత సభ్యుల సంతాప తీర్మానాలు పూర్తి అయ్యేవరకు అయినా ఉండాల్సిందని కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు అనారోగ్యంతో బాధపడిన కేసీఆర్ ఇకనైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.