సూపర్ స్టైల్‌తో డుకాటి XDiavel V4 బైక్ విడుదల.. అదిరిపోయే ఫీచర్లు.. టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ

సూపర్ స్టైల్‌తో డుకాటి XDiavel V4 బైక్ విడుదల.. అదిరిపోయే ఫీచర్లు.. టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ

ప్రముఖ లగ్జరీ బైకుల తయారీ సంస్థ డుకాటి  లేటెస్ట్ మోడల్ XDiavel V4ను ఇండియాలో లాంచ్ చేసింది. పాత V-ట్విన్ మోడల్ స్థానంలో ఇప్పుడు మరింత శక్తివంతమైన V4 గ్రాంటురిస్మో ఇంజిన్ తో క్రూయిజర్ లైనప్‌లో ఈ బైక్‌ను పరిచయం చేస్తుంది. స్పోర్ట్స్ బైకుల్లో ఉండే అత్యాధునిక V4 ఇంజిన్‌ను ఈ క్రూయిజర్ బైక్‌లో వాడారు. దీనివల్ల బైక్ చాలా వేగంగా, స్మూత్‌గా వెళ్తుంది. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బైకులను విదేశాల నుండి పూర్తిగా తయారు చేసి (CBU) ఇండియాకు తీసుకొస్తున్నారు. ప్రీమియం క్రూయిజర్ బైకులు ఇష్టపడే వారికి, స్పీడ్ తో పాటు లగ్జరీని కోరుకునే వారికి డుకాటి XDiavel V4 ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. 

ఇంజిన్ & పర్ఫార్మెన్స్ :

డుకాటి XDiavel V4లో 1,158cc V4 గ్రాంటురిస్మో లిక్విడ్-కూల్డ్  ఇంజిన్, 168 హార్స్ పవర్, 126 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్‌లో ఉన్న గొప్ప ఫీచర్ ఏంటంటే.. స్మార్ట్ సిలిండర్ టెక్నాలజీ అవసరాన్ని బట్టి సిలిండర్లను ఆటోమేటిక్‌గా ఆపేస్తుంది. మనం సిటీలో ట్రాఫిక్‌లో తక్కువ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు వేడి తగ్గించడానికి, పెట్రోల్ ఆదా చేయడానికి వెనుక ఉన్న సిలిండర్లను ఈ ఇంజిన్ తాత్కాలికంగా ఆపివేస్తుంది. లాంగ్ రైడ్ కోసమే కాకుండా, సిటీ ట్రాఫిక్‌లో కూడా హాయిగా నడిపేలా ఈ బైక్‌ను డిజైన్ చేశారు.

ALSO READ : ఇన్వెస్టర్లకు సిల్వర్ షాక్.. 3 గంటల్లో రూ.21వేలు పతనం.. 

టాప్ స్పీడ్ :
డుకాటీ  XDiavel V4 గంటకు 250 km/h స్పీడ్ తో దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా  ఉన్న అత్యంత వేగవంతమైన క్రూయిజర్‌లలో ఒకటిగా నిలిచింది. దీని సీటు ఎత్తు 770mm, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, వెడలపైన  హ్యాండిల్‌బార్, హైవే రైడ్స్ కి  కంట్రోలింగ్ రైడింగ్ పొజిషన్‌ను ఇస్తాయి.

సస్పెన్షన్, బ్రేక్‌లు:
అడ్జస్ట్ చేయగల అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ ఇచ్చారు. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో బ్రెంబో కాలిపర్‌లతో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కార్నరింగ్ ABS  బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ సెటప్ హై స్పీడ్ కంట్రోలింగ్ కోసం ట్యూన్ చేసింది. 

ఎలక్ట్రానిక్స్  ఫీచర్లు:
ఈ బైక్ కి ఫుల్ కలర్ TFT డిస్ ప్లే, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది.  

ధర: 
డుకాటి XDiavel  V4 ధర రూ. 30.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).  రాష్ట్ర పన్నులు, రిజిస్ట్రేషన్ ఖర్చులను బట్టి ఆన్-రోడ్ ధర కొంచెం పెరగవచ్చు. అన్ని ప్రముఖ నగరాల్లో డుకాటి  డీలర్‌షిప్‌ల ద్వారా డెలివరీలు ఉంటాయి.