ఇదెక్కడి ట్యాలెంట్ బాబూ.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు.. ప్రపంచ రికార్డు సృష్టించిన యంగ్ స్పిన్నర్ !

ఇదెక్కడి ట్యాలెంట్ బాబూ.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు.. ప్రపంచ రికార్డు సృష్టించిన యంగ్ స్పిన్నర్ !

మట్టిలో మాణిక్యాలు అంటారు కదా.. వరల్డ్ క్రికెట్లోకి అలాంటి ప్లేయర్లు అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తుంటారు. చరిత్రను తిరగరాస్తుంటారు. ఈ ప్లేయర్ కూడా అలాంటోడే. ఒకే ఇన్నింగ్స్ లో.. ఒకే మ్యాచ్ లో 8 వికెట్లు తీయటం మామూలు విషయమా. ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేని ఫీట్ ను సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు సోనమ్ యెషీ. సోషల్ మీడియాలో ఎవరీ సోనమ్ అంటూ ఫుల్లుగా వెతుకుతున్నారు క్రికెట్ అభిమానులు.

భూటాన్ కు చెందిన ప్లేయర్ సోనమ్ యెషీ ఇంటర్నేషనల్ టీ20 చరిత్రలో అరుదైన రికార్డును తనఖాతాలో వేసుకున్నాడు. టీ20లో ఒకే మ్యాచ్ లో 8 వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 

గెలెఫు లో జరిగిన మ్యాచ్ లో మయన్మార్ పై 8 వికెట్లు తీసి చరిత్రను తిరగరాశాడు. ఈ ఇన్నింగ్స్ లో సోనమ్ 4–1–7–8 తో అద్భుత బౌలర్ గా ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. 

ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన భూటాన్ 127 రన్స్ చేసి.. గెలుపు భారం యెషే పైన వేసింది. టీమ్ నమ్మకాన్ని వమ్ము  చేయకుండా జట్టును ఆదుకోవడమే కాదు.. మయన్మా్ర్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చేశాడు. 3వ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే పైయే ఫియో వై ను పెవిలియన్ కు పంపి.. భూటన్ లో ఆశలు కల్పించాడు. ఆ తర్వాత అదే ఓవర్ లో కోకో లిన్, కెప్టెన్ టెట్ అం గ్ లను కూడా పెవిలియన్ కు పంపించేశాడు. వరుసగా వికెట్లు తీస్తుండటంతో డిఫెండ్ చేసుకుందామనుకున్నా.. 9.2 ఓవర్లకు 45రన్స్ మాత్రమే చేయగలిగారు. 

►ALSO READ | చేసింది చాలు.. ముందు రంజీ ట్రోఫీకి కోచ్గా పనిచేయండి.. గంభీర్పై సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

యెషీ కి ముందు.. 7 వికెట్లు తీయడం అనేది టాప్ సీలింగ్. కొద్ది మంది మాత్రమే ప్రొఫెషనల్ టీ20  క్రికెట్ (అంటే ఇంటర్నేషనల్, స్థానిక, ఫ్రాంచైజ్ లలో ఆడిన కొందరు మాత్రమే7 వికెట్లు సాధించారు. 

ఏడు వికెట్లు తీసిన బౌలర్ల వివరాలు:

బౌలర్        ఫిగర్స్    టీమ్    అపోజిషన్        ఇయర్
సోనమ్ యెషే     8/7     భూటాన్     మయన్మార్         2025
స్యజ్రుల్ ఇద్రుస్     7/8     మలేషియా     చైనా         2023
కోలిన్ అకెర్మాన్     7/18     లీసెస్టర్‌షైర్     బర్మింగ్‌హామ్ బేర్స్     2019
తస్కిన్ అహ్మద్     7/19     ఢాకా     దర్బార్ రాజ్‌షాహి     2025
అలీ దావూద్         7/19     బహ్రెయిన్     భూటాన్         2025