గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టులో ప్రయోగాలు శృతిమించాయన్న విమర్శల ఇటు స్వదేశంలోనూ.. అటూ విదేశాల నుంచి కూడా పెరుగుతూనే ఉన్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్ కలిసి టీమిండియాను క్రికెట్ ల్యాబ్‌గా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్లానింగ్‌తో కూడిన మార్పులు కాకుండా, అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు జట్టును దెబ్బతీస్తున్నాయని ఇప్పటికే చాలా మంది విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో గంభీర్ పై సీనియర్ ప్లేయర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
గౌతమ్ గంభీర్ ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక నుంచి రంజీ ట్రోఫీకి కోచ్ గా వ్యవహరిస్తే బాగుంటుంది. రెడ్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే రంజీ చాలా ఉపయోగపడుతుందని సలహా ఇచ్చారు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్.
గంభీర్ వైట్ బాల్ క్రికెట్ లో సక్సెస్ ఫుల్ అయ్యారు కానీ.. రెడ్ బాల్ క్రికెట్ అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారు. అందుకోసం రంజీ కోచ్ గా చేస్తే బాగుంటుంది. అక్కడ ఇతర కోచ్ ల తో కలిసి టీమ్ జట్టు కూర్పు ఎలా చేయాలో నేర్చుకోవచ్చునని సలహా ఇచ్చారు. ఇక్కడ చేసింది చాలు.. ఇక రంజీ కోచ్ గా పనిచేయడం మంచిది అనే అర్థంలో షాకింగ్ కామెంట్స్ చేశారు పనేసర్.
►ALSO READ | సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సాత్విక్–రాధికాకు మిక్స్డ్ టైటిల్
టెస్టులకు హెడ్ కోచ్ గా VVS లక్ష్మణ్ ను తీసుకునేందుకు బీసీసీఐ ఆలోచిస్తోందని.. ఈ విషయంలో లక్ష్మణ్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో పనేసర్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత తంతరించుకున్నాయి. ఇండియా ఇటీవల టెస్టు సిరీస్ లలో చాలా దారుణంగా ఫెయిల్ అయింది. సౌతాఫ్రికాపై సొంత గడ్డపైన కూడా దారుణంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కెప్టెన్ శుభ్మన్ గిల్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పనేసర్. గిల్ ట్యాలెంటెడ్ ప్లేయర్ అయినప్పటికీ.. అన్ని ఫార్మాట్ లను లీడ్ చేసేంత కాదని అన్నాడు. కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో గిల్ కెప్టెన్సీలో టెస్టు క్రికెట్ లో ఇండియా రెండు వైట్ వాష్ లను మూటగట్టుకుంది. న్యూజీలాండ్ పై 3-0, సౌతాఫ్రికాపై 2-0 తో రెండు వైట్ వాష్ లకు గురికావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో గంభీర్ రంజీ కెప్టెన్ గా వ్యవహరించడం ఉత్తమమని పనేసర్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
