పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధనం కొరత ఏర్పడితేభారత్ దేశానికి ఆయిల్ సరఫరా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. గల్ఫ్ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున నిరంతర సరఫరాకు సిద్దంగా ఉన్నట్లు రష్యా దౌత్య వర్గాలు వెల్లడించాయి.
ఆరునుంచి 8వారాలపాటు చమురు డిమాండ్ ను తీర్చేందుకు తగినంత ముడి సరుకు, ఇంధన నిల్వలు తమ దగ్గర ఉన్నాయని మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న సైనిక సంఘర్షణ మద్య స్వల్పకాలికచమురు సరఫరా అడ్డంకులనుంచి దేశాన్ని కాపాడుతుందని భారత్ చెప్పడంతో రష్యా ఈ హామీ ఇచ్చింది.
భారత్ కు ముడి చమురు, పెట్రోలియం గ్యాస్ దిగుమతులన్నీ సగానిప హర్ముజ్ జలసంధి నుంచి రవాణ అవుతాయి.ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ సంధిని ద్వారా చమురు రవాణా అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధి గుండా షిప్పింగ్ ను అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. బీమా సంస్థల కవరేజ్ ని ఉపసంహరించుకుంది. ఇది ఆయిల్ షిప్కదలికలను ప్రభావితం చేసింది.
►ALSO READ | ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్‌ను నాశనం చేసినం.. అగ్ర నాయకత్వం కూడా ఖతం: ట్రంప్
ప్రస్తుతం మనదేశంలో 25 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయి. అదనపు బఫర్ లలో వాణిజ్యనిల్వలు, మంగళూరు, పాదూర్, విశాఖపట్నం దగ్గర వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు మొత్తం కలిపి దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉంది. చమురు సరఫరా ఆగిపోతే ఈ నిల్వలు 40నుంచి 45 రోజుల దిగుమతులను కవర్చేయొచ్చు.
మిడిల్ ఈస్ట్ లో ఏర్పడిన ఉద్రిక్తతల క్రమంలో చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ముడి చమురు, పెట్రోల్, డీజిల్ , ఏటీఎఫ్ వంటి కీలకమైన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరి తెలిపారు.
