వాళ్లను లేపేయటానికి నాకు ఒక్క బాంబు చాలు : ఇరాన్ కు మద్దతిస్తూ కిమ్ కామెంట్స్..!

వాళ్లను లేపేయటానికి నాకు ఒక్క బాంబు చాలు : ఇరాన్ కు మద్దతిస్తూ కిమ్ కామెంట్స్..!

ఏంటీ తొక్కలో మీటింగ్.. తొక్కలో యుద్ధం.. ఇన్నాళ్లు ఏంటీ.. ఇన్ని రోజులు ఏంటీ అన్నట్లు మాట్లాడుతున్నారు ఉత్తర కొరియా కింగ్ కిమ్.. నా మద్దతు ఇరాన్ దేశానికే.. నేను ఇరాన్ వైపే ఉంటాను అంటూ ప్రకటించారు కిమ్. ఇరాన్ దేశానికి మద్దతు ఇస్తూనే కిమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి..

వాళ్లను లేపేయటానికి.. అదేనండీ వాళ్లను నాశనం చేయటానికి నాకు ఒక్క క్షిపణి చాలు.. నాకు ఒక్క బాంబు చాలు అంటున్నారు. ఇరాన్ పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఉద్దేశించి కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఒక్క బాంబుతో నాశనం చేస్తానంటూ కిమ్ చెప్పాడంటే.. అది కచ్చితంగా అణు బాంబునే అనేది స్పష్టం అయ్యింది.

కొద్దిరోజుల నుండి  ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్  చేస్తున్న  యుద్ధం రోజూరికి భయంకరంగా మారుతున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. శనివారం నుండి ఇప్పటివరకు ఇరాన్‌లోని 1,250కి పైగా ప్రాంతాలను ధ్వంసం చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు చనిపోయినట్లు సమాచారం.

►ALSO READ | ఇరాన్ స్కూల్ పిల్లల ఖననం ఫొటో.. యుద్ధం వినాశనానికి సాక్ష్యం..!

ఇరాన్ కూడా ఊరికే ఉండకుండా ఎదురుదాడులు చేస్తోంది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. దుబాయ్‌లో అమెరికా సైనికులు ఉన్న చోట ఇరాన్  డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది అమెరికా సైనికులు మరణించారని, 70 మంది గాయపడ్డారని ఇరాన్ చెబుతోంది. ఈ యుద్ధం కేవలం ఇరాన్‌కే పరిమితం కాలేదు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కూడా కాల్పులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటికే 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం... ఇరాన్ గనుక కోరితే.. ఇజ్రాయెల్‌ను మట్టికరిపించడానికి మేము క్షిపణులను పంపిస్తాం. వాటిని తుడిచిపెట్టడానికి మా ఒక్క మిసైల్ చాలు అంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.