ఇరాన్ స్కూల్ పిల్లల ఖననం ఫొటో.. యుద్ధం వినాశనానికి సాక్ష్యం..!

ఇరాన్ స్కూల్ పిల్లల ఖననం ఫొటో.. యుద్ధం వినాశనానికి సాక్ష్యం..!

కళ్ల ముందు ఓ చిన్నారి చనిపోతేనే అయ్యో పాపం అంటాం.. ఎవరి ఇంట్లో అయినా చిన్న పిల్లలు మరణిస్తే మనకు కన్నీళ్లు వస్తాయి.. అలాంటిది.. ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు.. ఎంతో ముచ్చటగా రెడీ అయ్యి ఉదయం స్కూల్ కు వెళ్లారు.. సాయంత్రానికి శవాలుగా వచ్చారు.. ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 165 మంది చిన్న పిల్లలు.. ఒకే రోజు.. ఒకే స్కూల్ లో.. ఒకే సమయం.. వాళ్ల బతుకులు తెల్లారిపోయాయి. అల్లారుముద్దుగా చూసుకుంటూ.. గోరుముద్దలు పెట్టి బడికి పంపిన పిల్లలను.. స్కూల్ నుంచి శవాలుగా తీసుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. చనిపోయిన 165 మంది చిన్నారులను.. ఒకేచోట.. ఒకేసారి.. ఖననం చేస్తున్న ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇరాన్ లో యుద్ధం వినాశనం ఎలా ఉంది అనే దానికి సజీవ సాక్షంగా ఈ ఫొటోను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

ఇరాన్ లో స్కూళ్లపై జరిగిన దాడిలో చనిపోయిన స్కూల్​ పిల్లల ఖననానికి తవ్విన సమాధుల ఫొటో ఇది.. నాలుగు రోజుల యుద్దం వినాశనానికి సాక్ష్యం అంటూ ఓఫోటోను ఇరాన్​ విదేశాంగమంత్రి షేర్​చేశారు. 

►ALSO READ | నటాంజ్ అణు కేంద్రంపై దాడి నిజమే.. రేడియేషన్ లీక్ కాలే: IAEA

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మంగళవారం Xలో కొత్తగా తవ్విన సమాధుల వరుసలను చూపించే ఫొటోను షేర్​ చేశారు. మినాబ్‌లోని ఓ పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి చేసిన వైమానిక దాడిలో మరణించిన 150 మందికి పైగా బాలికల కోసం అవి సిద్ధంగా ఉన్నాయంటూ  రాశారు. 

’’ఇరాన్​ పాఠశాలలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించిన 160 మందికి పైగా అమాయక బాలికలకోసం తవ్విన సమాధులు ఇవి. విద్యార్థుల మృతదేహాలు ముక్కలు ముక్కలుగా నలిగిపోయాయి. మిస్టర్ ట్రంప్ వాగ్దానం చేసిన  రక్షణ.. వాస్తవంలో ఇలాగే కనిపిస్తుంది. గాజా నుంచి మినాబ్ వరకు అమాయకులు క్రూరంగా హత్య చేయబడ్డారు’’ అని ఇరాన్​ విదేశాంగ మంత్రి బరాగ్చీ ఫొటోపాటు ఈనోట్ ను షేర్​ చేశారు.