వాషింగ్టన్: ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రంపై దాడి నిజమేనని యూఎన్ వాచ్ డాగ్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) నిర్ధారించింది. లేటేస్ట్ శాటిలైట్ ఇమేజెస్‌ను పరిశీలించి అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో నటాంజ్ అణు కేంద్రం దెబ్బ తిన్నట్లు ఐఏఈఏ ధ్రువీకరించింది. అణు కేంద్రం ప్రవేశద్వారం దగ్గర ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది.
కానీ రేడియేషన్ లీకేజీ మాత్రం కాలేదని స్పష్టం చేసింది. గత సంవత్సరం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలోనే నటాంజ్ అణు కేంద్రం భారీగా దెబ్బతిన్నట్లు గుర్తు చేసింది. కాగా, 2026, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసిన విషయం తెలిసిందే.
►ALSO READ | ట్రంప్ మెడపై ఏంటా గాయం.. ఆరోగ్యంగానే ఉన్నాడా..!
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు చేశాయని ఇరాన్ రాయబారి ఐఏఈఏ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ మేరకు తాజా ఉపగ్రహ చాయా చిత్రాలను పరిశీలించిన ఐఏఈఏ నటాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగింది నిజమేనని ధృవీకరించింది. కానీ రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. ఒకవేళ రేడియేషన్ లీక్ మాత్రం అయితే పెను ప్రమాదమే జరిగేది.
