Chiranjeevi: 'రయ్ రయ్ రారా' సెన్సేషన్.. 'పెద్ది' పాటలో రామ్ చరణ్ మాస్ ఎనర్జీకి మెగాస్టార్ ఫిదా!

Chiranjeevi: 'రయ్ రయ్ రారా' సెన్సేషన్.. 'పెద్ది' పాటలో  రామ్ చరణ్ మాస్ ఎనర్జీకి మెగాస్టార్ ఫిదా!

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన రెండో పాట ‘రయ్ రయ్ రారా’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది మెగా అభిమానులకు ఒక ఎనర్జీ యాంథమ్ గా మారిపోయింది.

రెహమాన్ మ్యాజిక్.. చరణ్ గ్రేస్!

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన హై-వోల్టేజ్ బీట్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. సాధారణంగా రెహమాన్ మెలోడీలకు పెట్టింది పేరు, కానీ ‘రయ్ రయ్ రారా’లో ఆయన చూపించిన మాస్ వేరియేషన్ మ్యూజిక్ లవర్స్‌ను ఆశ్చర్యపరిచింది. అనంత శ్రీరామ్ రాసిన పవర్ ఫుల్ పదాలు, దానికి తోడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ వేసిన సిగ్నేచర్ స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చరణ్ తన బాడీలో చూపిస్తున్న ఈజ్, గ్రేస్ చూస్తుంటే పాత చిరంజీవి గారిని గుర్తుకు తెస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మెగాస్టార్ ఎమోషనల్ రివ్యూ

ఈ పాటపై స్వయంగా మెగాస్టార్ చిరంజీవి స్పందించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘రయ్ రయ్ రారా’ పాటలో ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ అద్భుతంగా కలిసిపోయాయి. సూపర్ స్పీడ్‌లోనూ అద్భుతమైన గ్రేస్‌తో స్టెప్పులు వేస్తూ కనిపించిన చరణ్‌ను చూస్తుంటే తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది అని ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను, రత్నవేలు విజువల్స్ పట్ల ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.

గ్రామీణ నేపథ్యంలో..

 ‘పెద్ది’ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక విలక్షణమైన లుక్‌లో కనిపిస్తున్నారు. టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ పాటను అత్యంత గ్రాండ్‌గా చిత్రీకరించారు. పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం మధ్య రామ్ చరణ్ మాస్ ఎనర్జీని ఆయన కెమెరాలో బంధించిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంటున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్,  సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

►ALSO READ | Nidhhi Agerwal: బ్లాక్ డ్రెస్‌లో నిధి అగర్వాల్ గ్లామర్ విందు.. 'రాజా సాబ్' బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్!

ఇప్పటికే విడుదలైన టీజర్, మొదటి పాట ‘పెద్ది’పై హైప్‌ను పెంచగా, ఇప్పుడు ‘రయ్ రయ్ రారా’ ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగాస్టార్ ఆశీస్సులతో, బుచ్చిబాబు కష్టంతో, చరణ్ ఎనర్జీతో ‘పెద్ది’ కచ్చితంగా ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్ కాబోతోందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.