విజయవాడ: తెలంగాణ షట్లర్ సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ.. సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సాత్విక్–రాధిక 21–9, 21–15తో టాప్‌సీడ్ అషిత్ సూర్య–అమృతపై గెలిచారు. విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో సూర్య చరిష్మ 17–21, 21–12, 21–14తో తన్వీ పత్రిపై, మెన్స్ సింగిల్స్‌లో రిత్విక్ సంజీవి 21–16, 22–20తో భరత్ రాఘవ్‌పై నెగ్గి టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. విమెన్స్ డబుల్స్ ఫైనల్లో శిఖా గౌతమ్–అశ్విని భట్ 21–14, 21–18తో రెండోసీడ్ ప్రియా దేవి–శ్రుతి మిశ్రాపై గెలిచారు. మెన్స్ డబుల్స్ టైటిల్ ఫైట్‌లో టాప్‌సీడ్ హరిహరన్–రూబెన్ కుమార్ 21–17, 21–12తో మిథిలేష్ కృష్ణన్–ప్రేజన్‌పై నెగ్గారు.
