భారత టెలికాం సంస్థ BSNL ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం స్పెషల్ హోలీ ఆఫర్ 2026 తీసుకొచ్చింది. మీరు ఎక్కువ వాలిడిటీ ఇచ్చే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ అఫర్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు మార్చి 1 నుండి మార్చి 31 మధ్య రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, మీకు 14 రోజుల ఎక్స్ట్రా వాలిడిటీ లభిస్తుంది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు.
BSNL రూ. 997 ప్లాన్ వాలిడిటీ:
సాధారణంగా రూ. 997 ప్లాన్ మీకు 150 రోజుల వాలిడిటీ ఇస్తుంది. కానీ హోలీ ఆఫర్‌తో రీఛార్జ్ చేస్తే మీకు మొత్తం 164 రోజుల వాలిడిటీ వస్తుంది అంటే మరో రెండు వారాలు ఎక్స్ట్రా. మీరు ఎలాంటి కూపన్లు లేదా కోడ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎప్పటిలాగే సాధారణంగా రీఛార్జ్ చేస్తే చాలు.
2GB డైలీ డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్
ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. మీరు మీ డైలీ లిమిట్ దాటితే స్పీడ్ తగ్గుతుంది, కానీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మీరు ఒకే రీఛార్జ్‌తో ఎక్కువ రోజులపాటు డేటా, కాలింగ్ రెండింటినీ ఇష్టపడితే, ఈ ప్లాన్ చాల ఉపయోగపడుతుంది.
BSNL రూ. 997 ప్లాన్ రీఛార్జ్ చేయడం ఎలా
వినియోగదారులు బహుళ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు:
రీఛార్జ్ చేసుకోవడం ఎలా?
మీరు ఎప్పటిలాగే మీకు నచ్చిన పద్ధతిలో రీఛార్జ్ చేసుకోవచ్చు.
*BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా BSNL Selfcare యాప్ ద్వారా.
*PhonePe, Google Pay, Paytm వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా.
*మీ ఇంటి దగ్గర ఉండే మొబైల్ షాపుల్లో కూడా ఈ రీఛార్జ్ చేయించుకోవచ్చు.
ఈ 14 రోజుల ఎక్స్ట్రా వాలిడిటీ కేవలం మార్చి నెలలో అంటే మార్చి 1 నుండి 31లోపు రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
