T20 World Cup: టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్–ఇంగ్లాండ్ మధ్య పోరు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్, డ్యూ ఫ్యాక్టర్, స్కోర్‌బోర్డ్ ఒత్తిడిలాంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఇరు జట్ల కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్–హ్యారీ బ్రూక్ నాయకత్వ మధ్య పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
టాస్ కీలక పాత్ర:
ముంబైలోని వాంఖడే మైదానంలో ఇప్పటి వరకు “టాస్ గెలిస్తే బౌలింగ్” తీసుకోవాలన్నది ప్రతి జట్టు తీసుకునే నిర్ణయం. సాయంత్రం డ్యూ ప్రభావంతో వలన సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కష్టమవుతుందనే భావన టీమ్స్ ఉంటాయి. అయితే 2026 టోర్నీలో సూపర్-–8 దశలో అనేక మ్యాచ్‌లు తొలుత బ్యాటింగ్ చేసి గెలవడం గమనార్హం. 185+ టార్గెట్స్ ఉంటే ప్రపంచకప్ ఒత్తిడిలో చేజింగ్ జట్లకు మానసికంగా భారం పెరుగుతోందని గణాంకాలు సూచిస్తున్నాయి.
హ్యారీ బ్రూక్ కు బిగ్ సవాల్:
జోస్ బట్లర్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన హ్యారీ బ్రూక్‌కు ఇది తొలి వరల్డ్‌కప్ నాకౌట్ టాస్. బ్రూక్ నాయకత్వంలో ఇంగ్లాండ్ “ఏదైనా ఛేజ్ చేద్దాం” అనే విధానానికి బదులుగా భారీ స్కోర్లు సెటప్ చేసే దిశగా దూసుకుపోతుంది. టాస్ గెలిస్తే సంప్రదాయానికి విరుద్ధంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. 200కు పైగా లక్ష్యాన్ని ముందుంచి టీమిండియాపై ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది.
డ్యూ వర్సెస్ స్కోర్‌బోర్డ్ ఒత్తిడి:
ముంబైలో సాయంత్రం సమయాల్లో డ్యూ స్పిన్నర్లకు ఇబ్బందికరంగా మారుతుంది. కానీ పెద్ద టార్గెట్ ని ఛేజ్ చేయాల్సి వస్తే మాత్రం బౌలింగ్ జట్టుపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ టోర్నీలో 185+ దాటిన లక్ష్యాలను చేజ్ చేయడంలో ప్రత్యర్థి జట్లు తీవ్రంగా కష్టపడ్డాయి. కాబట్టి డ్యూ కంటే స్కోర్‌బోర్డ్ ఒత్తిడి కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది.
►ALSO READ | IPL 2026: RCB ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. బెంగళూర్లోనే హోం మ్యాచెస్.. కాకపోతే..
వాంఖడే పిచ్ స్వభావం:
మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు అదనపు బౌన్స్, స్వింగ్ లభించే అవకాశం ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్లు పవర్‌ప్లేలో ఈ పరిస్థితులను సమర్థంగా వినియోగించునే ఛాన్స్ ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే టీమ్ కు పవర్‌ప్లేలో అనుకూల పరిస్థితులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ వేదికపై టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్ 77/6కు కుదేలైన సంఘటన గుర్తు పెట్టుకుని ఇరు జట్ల కెప్టెన్లు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉండొచ్చు.
‘SKY’ వర్సెస్ ‘బ్రూక్’:
భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్-అప్ ఆధారిత వ్యూహాలను అనుసరించే నాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు. మరోవైపు ఇంగ్లీష్ టీమ్ సారథి హ్యారీ బ్రూక్ దూకుడు తత్వంతో, ప్రారంభంలోనే ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తాడు. ఈ రెండు విభిన్న మనస్తత్వం కలిగిన నాయకుల మధ్య పోరు చెస్ మ్యాచ్‌లా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో విజేతగా నిలిచి ఫైనల్‌కు అడుగు పెట్టాలని రెండు టీమ్స్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. కేవలం టాస్ కాదు, స్కోర్‌బోర్డ్ ఒత్తిడిని ఎవరు సమర్థంగా అధిగమిస్తారనేది గురువారం నాడు తేలనుంది.
