సినీనటి కొణిదెల నిహారిక కుమ్రంబీమ్ జిల్లాలో సందడి చేశారు. ఆదివారం (డిసెంబర్ 28) సిర్పూర్ యు మండలం శెట్టి అడపనూర్ గూడెం సందర్శించిన ఆమె.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. ఆదివాసీలతో ముచ్చటించారు.
ఏఎస్పీ చిత్తరంజన్ జన్మదినం సందర్భంగా అదివాసీ బిడ్డలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిహారిక అదివాసీ మహిళలతో అడిపాడారు. అదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను మేచ్చుకున్నారు.
ఎప్పుడూ సిటీలో కాంక్రీట్ జెంగిల్ ఉండే తమకు.. ఇలాంటి ప్రకృతి ఒడిలోకి రావటం తీయని అనుభూతి అని అన్నారు. స్వచ్ఛమైన మట్టిమనుషులతో గడపిన సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
