మంథనిలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : మంత్రి శ్రీధర్ బాబు

మంథనిలో  అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి నది తీరంలో నిర్మించే ఘాట్ల వద్ద నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను పుష్కరాల వరకు పూర్తి చేయాలన్నారు. 

పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకముందు దివంగత నేత, మాజీ స్పీకర్ శ్రీపాదరావు సోదరి, మంత్రి శ్రీధర్ బాబు మేనత్త  సువర్ణ వనమాల మృతి చెందగా ఆమె అంతక్రియల్లో పాల్గొని పాడె మోశారు. మున్సిపల్ చైర్​పర్సన్ ఒడ్నాల శ్రీనివాస్,  వైస్ చైర్​పర్సన్ సహేందర్ రెడ్డి, నాయకులు తోట్ల తిరుపతి యాదవ్,  కాచే శశి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.